బిగ్ బాస్ 3 జూలై 21నుండి ?


Big Boss 3 Nagarjuna
Big Boss 3 Nagarjuna

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 జూలై 21 నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది . ఇప్పటివరకు అధికారికంగా ఫలానా రోజున ప్రారంభం అని ప్రకటించలేదు కానీ తాజా సమాచారం ప్రకారం ఈనెల 21న తెలుగు బిగ్ బాస్ ప్రారంభం కానుందట ! ఈసారి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటంతో బిగ్ బాస్ 3 కి అప్పుడే అనూహ్యమైన క్రేజ్ వచ్చింది .

వంద రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో నాగార్జున ప్రతీ వారంలో రెండుసార్లు కనిపించి అభిమానులను అలరించనున్నాడు . ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసాడు నాగ్ దాంతో బిగ్ బాస్ 3 ని మరింతగా రక్తికట్టించడం ఖాయమని ఆశిస్తున్నారు . బిగ్ బాస్ మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండో సీజన్ కు నాని ,ఇక ఇప్పుడేమో మూడో సీజన్ కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నాడు .