బిగ్ బాస్ 4: లాస్య ఎలిమినేటెడ్!


బిగ్ బాస్ 4: లాస్య ఎలిమినేటెడ్!
బిగ్ బాస్ 4: లాస్య ఎలిమినేటెడ్!

బిగ్ బాస్ సీజన్ 4 రోజులు గడిచే కొద్దీ మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ సీజన్ 11వ వారంలో ఉంది. ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. లాస్య, అభిజీత్, సోహైల్, అరియనా, హారిక, మోనాల్ లు ప్రస్తుతం నామినేషన్స్ లో ఉన్నారు. ఈ ఆరుగురిలో తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా లాస్య ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ లో మొదటి వారం నుండి ఎలిమినేషన్ ప్రక్రియ సీక్రెట్ గా ఉండట్లేదు. ఏదో రకంగా లీకవుతోంది. ప్రస్తుతం హౌజ్ లో ఎనిమిది మంది ఉండగా ప్రస్తుతం లాస్య ఎలిమినేషన్ తో ఇంకా ఏడుగురు మాత్రమే ఉన్నారు. డిసెంబర్ 20న బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ జరుగుతుంది. మిగిలిన రెండు వారాల్లో ఇద్దరు ఎలిమినేట్ అవుతారు.

మరో ఐదుగురు ఫైనల్స్ కు వెళతారు. అఖిల్, అభిజీత్, సోహైల్ లు ఫైనల్స్ కు వెళ్లే కంటెస్టెంట్స్ గా బలంగా కనిపిస్తున్నారు. మరి ఈ సీజన్ బిగ్ బాస్ లో ఎవరు విజేతలుగా నిలుస్తారో అన్నది చూడాలి.