సల్మాన్ ఖాన్ రేప్ చేశాడంటున్న పూజా మిశ్రా


Bigg Boss contestant pooja mishra sensational comments on salman khan

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నన్ను రేప్ చేసాడని సంచలన ఆరోపణలు చేసింది పూజా మిశ్రా . హిందీ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న భామ పూజా మిశ్రా . బిగ్ బాస్ సీజన్ కు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే . అయితే బిగ్ బాస్ షోలో పాల్గొన్న సమయంలోనే సల్మాన్ వేధించాడని ఇక సల్మాన్ నటించిన సుల్తాన్ చిత్ర షూటింగ్ సమయంలో నాపై సల్మాన్ ఖాన్ అత్యంత క్రూరంగా అత్యాచారం చేసాడని సంచలన ఆరోపణలు చేసింది . అంతేకాదు సల్మాన్ ఖాన్ ఒక్కడు మాత్రమే కాదు అతడి సోదరులైన అర్భాజ్ ఖాన్ , సోహైల్ ఖాన్ లు కూడా నన్ను వేధించారని , సీనియర్ నటుడు శత్రుఘ్ను సిన్హా సైతం నన్ను రేప్ చేసాడని అంటోంది పూజా మిశ్రా .

సల్మాన్ ఖాన్ వల్ల అలాగే అతడి సోదరుల వల్ల నాకు ప్రాణహాని ఉందని , నాకు తగిన న్యాయం చేయాలనీ కోరుతోంది పూజా మిశ్రా . గతకొద్ది రోజులుగా మీ టూ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో ఒక్కక్కరు వెలుగులోకి వస్తున్నారు . ఇక పూజా మిశ్రా చేసిన ఆరోపణలు బాలీవుడ్ ని కుదిపేస్తున్నాయి . ఎందుకంటే సల్మాన్ ఖాన్ పెద్ద హీరో దాంతో మరో మలుపు తిరిగింది మీ టూ ఉద్యమం . పూజా మిశ్రా సంచలన ఆరోపణలు చేసినప్పటికీ సల్మాన్ ఖాన్ కానీ అతడి సోదరులు కానీ ఇంతవరకు స్పందించలేదు .

English Title: Bigg Boss contestant pooja mishra sensational comments on salman khan