`వైల్డ్ డాగ్‌` కోసం గంగ‌వ్వ‌ని రంగంలోకి దింపారుగా!

Bigg boss fame gangavva interview with king nagarjuna for wild dog
Bigg boss fame gangavva interview with king nagarjuna for wild dog

కింగ్ నాగార్జున న‌టిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `వైల్డ్ డాగ్‌`. అహిషోర్ సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంపై కింగ్ నాగార్జున భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. ఇటీవ‌ల చేసిన `మ‌న్మ‌థుడు2` మిస్ ఫైర్ కావ‌డంతో ఆచి తూచి అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించుకున్న నాగ్ ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తో ఎలాగైనా టెర్రిఫిక్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకుని ఐయామ్ ఇన్ ద రేస్ అని అనిపించుకోవాల‌నుకుంటున్నారు.

ఏప్రిల్ 2న ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ప‌ప్ర‌మోష‌న్స్‌ని స్టార్ట్ చేసింది. ఇటీవ‌లే చిత్ర బృందాన్ని యాంక‌ర్ శ్రీ‌ముఖి కంబైన్డ్‌గా ఇంట‌ర్వ్యూ చేసింది. దానికి సంబంధించిన వీడియోలు ఇటీవ‌ల మీడియాకు విడుద‌ల‌య్యాయి కూడా. ఇది కూడా చాల‌ద‌నుకున్నారో ఏమో `వైల్డ్ డాగ్‌` టీమ్ ఏకంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్‌, యూట్యూబ్ సంచ‌ల‌నం గంగ‌వ్వ‌ని రంగంలోకి దించేశారు.

ఏకంగా గంగ‌వ్వ‌తో కింగ్ నాగార్జున‌నే ఓ ప్ర‌త్యేక సెట‌ప్‌లో ఇంట‌ర్వ్యూ చేయించింది చిత్ర బృందం. దీంతో ఈ మూవీ ప్ర‌చారం హాట్ టాపిక్‌గా మారింది. యూట్యూబ్ సంచ‌ల‌నం గంగ‌వ్వ‌ని రంగంలోకి దింప‌డం కొంత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే విష‌య‌మే అయినా ఆమె వ‌ల్ల సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌ని, మ‌రింత మందికి చేరువ అవుతుంద‌ని మేక‌ర్స్ భావించి ప్ర‌త్యేకంగా ఆమెతో ఇంట‌ర్వ్యూ ప్లాన్ చేశార‌ట‌.