మహేష్ ను ఎలిమినేట్ చేయడానికి బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్Mahesh Big Boss 3 Telugu
Mahesh Big Boss 3 Telugu

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో పార్టిసిపంట్స్ ఆడే గేమ్ కన్నా బిగ్ బాస్ ఆడే గేమ్ ఎక్కువైపోయింది. సెకండ్ సీజన్ లో అనవసరంగా కౌశల్ కు ఎక్కువ స్కోప్ ఇవ్వడం ద్వారా అతను గేమ్ ను ఎలా శాసించాడో మనం చూసాం. అందుకే ఈసారి అతి జాగ్రత్తకు పోయిన బిగ్ బాస్ ఎవరినీ హైలైట్ అవ్వడానికి ఒప్పుకోవట్లేదు.

అందుకే బాగా గేమ్ ఆడుతున్నారు అనగానే నాగార్జున చేత బాబా భాస్కర్ ను కారణం లేకుండా తిట్టించారు, శ్రీముఖిని సరైన వీడియో ప్రూఫ్ లేకుండానే నిందించారు. కావాలనే నలుగురు గ్రూప్ గా తయారైన వరుణ్, వితిక, రాహుల్, పునర్నవిలకు కొంత హైప్ ఇచ్చారు. వాళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు అని తెలియగానే ఆ గ్రూప్ ను విడదీసి పునర్నవిని ఎలిమినేట్ చేసారు, తద్వారా రాహుల్ ను వీక్ చేసారు.

ఇంతటితో అయిపోలేదు, గత కొన్ని వారాలుగా మహేష్ ను ఎలిమినేట్ చేయాలన్న ప్రయత్నాలు ఫలించట్లేదు. ఆ సమయానికి వేరే కంటెస్టెంట్ వీక్ అవ్వడంతో మహేష్ సేవ్ అవుతూ వచ్చాడు. అందుకే ఈసారి తక్కువమంది నామినేషన్స్ లో ఉండేలా బిగ్ బాస్ టాస్క్ డిజైన్ చేసాడు. వరుణ్, రాహుల్, మహేష్ నామినేషన్స్ లోకి వచ్చారు. ముగ్గురూ స్ట్రాంగ్ కాబట్టి మహేష్ కు ఈసారి సేవ్ అవ్వడం మరింత కష్టంగా మారొచ్చు. మరి బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ ఈసారైనా వర్కౌట్ అవుతుందా?