రాహుల్ ను తురుమ్ రా! బిగ్ బాస్ సీజన్ 3 ఫినాలే కుమ్మేసింది


రాహుల్ ను తురుమ్ రా! బిగ్ బాస్ సీజన్ 3 ఫినాలే కుమ్మేసింది
రాహుల్ ను తురుమ్ రా! బిగ్ బాస్ సీజన్ 3 ఫినాలే కుమ్మేసింది

బిగ్ బాస్ సీజన్ 3 ఎట్టకేలకు ముగిసింది. ఎన్నో హంగుల మధ్య జరిగిన బిగ్ బాస్ ఫినాలే ఎట్టకేలకు ముగింపుకు వచ్చింది. 105 రోజుల ప్రయాణం చివరికి వచ్చింది. శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ టాప్ 2 కు వెళ్లగా, రాహుల్ బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచాడు. వరసగా మూడో సారి కూడా అబ్బాయే గెలవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిజానికి శ్రీముఖి ఫైనల్స్ కు వెళ్ళగానే ఒక్క అమ్మాయే వెళ్ళింది కాబట్టి ఈసారి ఆమే గెలుస్తుంది అనుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 1 లో శివబాలాజీ గెలవడం, సీజన్ 2 లో కౌశల్ విన్ అవ్వడంతో సీజన్ 3 అమ్మాయికి ఇస్తారని ఆశ పడ్డారు. కానీ ప్రేక్షకుల తీర్పు వేరుగా ఉంది. అమ్మాయా, అబ్బాయా అన్నది చూడకుండా అభిమానులు తమ మనసుకు నచ్చిన కంటెస్టెంట్ కే ఓటు వేశారు.

బిగ్ బాస్ అనేది వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఇందులో ఉండే హంగులు మాములుగా ఉండవు. మాములు టాస్క్స్ లోనే బిగ్ బాస్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఫినాలే అంటే ఎలా ఉంటుందో మాములుగా చెప్పాలా? షో మొదలవ్వడమే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ డ్యాన్స్ నంబర్స్ తో అదిరిపోయేలా సాగింది. ఇక ఆ తర్వాత నాగార్జున ఎంట్రీ ఇవ్వడంతో షో లో ఒక్కసారిగా ఊపు వచ్చింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ ఒక చోట కూర్చోబెట్టి వారితో సరదాగా కబుర్లు చెప్పాడు. మరోవైపు హౌజ్ లో ఉన్న ఐదుగురు ఫైనలిస్ట్స్ బాబా భాస్కర్, శ్రీముఖి, రాహుల్, అలీ, వరుణ్ సందేశ్ లు హౌజ్ లో టెన్షన్ పడుతూ కూర్చున్నారు. బిగ్ బాస్ ఫైనల్స్ ఎలా జరుగుతుంది అన్నది చాలా మందికి ఐడియా ఉంది. ఫైనల్స్ కు చేరిన ఐదుగురిలో ఒక్కొక్కరినీ ఎలిమినేట్ చేస్తూ వస్తారు. ఒక్కొక్కరిని డిఫరెంట్ పద్దతులతో ఎలిమినేట్ చేస్తూ జనాలను టెన్షన్ లో ముంచెత్తుతారు.

ఈసారి కూడా అదే జరిగింది. కాకపోతే మరికొంత విభిన్నంగా. ఈసారి సెలబ్రిటీల ద్వారా ఎలిమినేషన్ జరగడం కొత్తగా ఉంది. మొదటి ఎలిమినేషన్ చేయడానికి ప్రతిరోజూ పండగే హీరోయిన్ రాశి ఖన్నా, దర్శకుడు మారుతి బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చి ఫస్ట్ ఎలిమినేషన్ చేసారు. కొంచెం టెన్షన్ పెడుతూ ఫస్ట్ ఎలిమినేట్ అయిన కాండిడేట్ అలీ అని చెప్పి అతణ్ణి తీసుకుని హౌజ్ లో నుండి బయటకు వచ్చేసారు. ఇక సెకండ్ ఎలిమినేషన్ చేయడానికి శ్రీకాంత్ వచ్చాడు. ఇక్కడ ఒక ఇంటరెస్టింగ్ విషయం చెప్పాడు నాగార్జున. ఇద్దరం కలిసి నాలుగు సినిమాలు చేసాం అని శ్రీకాంత్ అంటే కాదు మొత్తంగా ఐదు సినిమాలు చేసాం హలో బ్రదర్ సినిమాలో నా డూప్ గా చేసాడు శ్రీకాంత్ అని చెప్పాడు నాగార్జున. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే శ్రీకాంత్ కూడా ఇంట్లోకి వెళ్ళాడు సెకండ్ ఎలిమినేషన్ చేయడానికి. కాకపోతే ఈసారి చిన్న ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌజ్ లోకి 20 లక్షలు పంపాడు. ఎవరైతే టైటిల్ గెలవరు అనుకుంటున్నారో వారు ఈ 20 లక్షలు పట్టుకుని వెళ్లిపోవచ్చు అని ఆఫర్ ఇచ్చారు. అయితే ఎవరూ కూడా తమ క్యారెక్టర్ ను జడ్జ్ చేస్తారేమో అన్న భయంతో డబ్బు తీసుకోవడానికి ఇష్టపడలేదు. శ్రీకాంత్, కొద్దిసేపు టెన్షన్ తర్వాత వరుణ్ సందేశ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. క్యాథెరిన్ కూడా హౌజ్ లోకి వచ్చి హల్చల్ చేసింది. దానికి ముందు ఆమె చేసిన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ అందరినీ ఆకట్టుకుంది. వరుణ్ ను ఒక స్టేజ్ లో అందరూ టైటిల్ విన్నర్ అనుకున్నారు. కానీ లాస్ట్ డల్ అయిపోయి వరుణ్ ఓటమి కొనితెచ్చుకున్నాడు. ఇక బాబా భాస్కర్ ను ఎలిమినేట్ చేయడానికి అంజలి హౌజ్ లోకి వచ్చింది. ఈసారి కూడా సూట్ కేస్ తో 25 లక్షలు పట్టుకొచ్చి బిగ్ బాస్ టెంప్ట్ చేసే ప్రయత్నం చేసినా అది జరగలేదు. ఎవరూ డబ్బు తీసుకోవడానికి ఇష్టపడలేదు.

ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఎలిమినేషన్ కోసం నాగార్జున స్వయంగా రంగంలోకి దిగాడు. ఇంట్లోకి వచ్చి రాహుల్, శ్రీముఖిను హౌజ్ లో నుండి స్టేజ్ మీదకు తీసుకువచ్చాడు. ఇక బిగ్ బాస్ లో అసలైన అట్రాక్షన్ మెగాస్టార్ చిరంజీవి రాక. చిరంజీవి స్టేజ్ మీద చేసిన హడావిడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందరు హౌజ్ మేట్స్ ను గుర్తుపట్టి వారి మీద పంచ్ లు వేస్తూ, ఆట పట్టిస్తూ ఓ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ పంచాడు.

ఇదంతా అయిపోయిన తర్వాత రాహుల్ ను విన్నర్ గా ప్రకటించడంతో బిగ్ బాస్ సీజన్ 3 కు తెరపడింది.