రాహుల్, పునర్నవి హీరో హీరోయిన్లుగా సినిమా.. అయ్యే పనేనా?

bigg boss winner rahul sipligunj wants to act with punarnavi
bigg boss winner rahul sipligunj wants to act with punarnavi

నిజంగా చూసుకుంటే రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాళం బిగ్ బాస్ హౌజ్ లో టాస్క్ లు ఆడింది చాలా తక్కువ. అయినా ఇద్దరూ అంత కాలం బిగ్ బాస్ హౌజ్ లో కొనసాగారంటే దానికి వాళ్లిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఒక కారణం. వీళ్ళిద్దరినీ కలిసి చూడటానికి జనాలు బాగా ఇష్టపడ్డారు. బిగ్ బాస్ కూడా వీళ్లిద్దరు కలిసి ఉండేలా టాస్క్ లు రూపొందించడం జరిగింది. బిగ్ బాస్ కు ముందు రాహుల్ గురించి జనాలకు తెలిసింది తక్కువే. సినిమాలు బాగా ఫాలో అయ్యా కొద్దిమందికి మాత్రం పాటలు పాడతాడని తెలుసు. రంగస్థలం టైటిల్ సాంగ్ తో జనాలకు కొంచెం చేరువయ్యాడు రాహుల్.

ఇక పునర్నవి అయితే ఉయ్యాలా జంపాల అనే ఒకే సినిమా చేసింది. అందులో కూడా కాసేపే కనిపిస్తుంది. కానీ ఆమెకు కుర్రాళ్లలో ఫాలోయింగ్ బాగుంది. సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్ గా ఉంటుంది. అయితే బిగ్ బాస్ పూర్తయ్యాక సీన్ మారిపోయింది. ఇద్దరూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు తెలియడమే కాదు, గూగుల్ లో కూడా ట్రెండ్ అవుతున్నారు. ఇద్దరిలో ఎవరి పేరు గూగుల్ లో సెర్చ్ చేసినా రెండో వ్యక్తి వస్తుండడం వీరిద్దరికీ కెమిస్ట్రీ ఎంత బాగుందో తెలియజేస్తుంది.

ఇక రాహుల్ బిగ్ బాస్ సీజన్ 3 విన్ అయ్యాక ఛానల్ ఏంటన్నది కూడా చూడకుండా ఎడాపెడా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. అలా ఇచ్చిన ఇంటర్వ్యూలలో మీకు సినిమా అవకాశాలు ఎలా వస్తున్నాయి, అసలు ఎవరైనా సంప్రదిస్తున్నారా అని అడిగితే రాహుల్, అవకాశాలైతే బానే వస్తున్నాయి. నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తామంటున్నారు కానీ ఒప్పుకోవాలో వద్దో తేల్చుకోలేకపోతున్నా. ఒకవేళ పునర్నవిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసి నన్ను హీరోగా చేయమంటే కచ్చితంగా చేస్తా. 100 కు 110 శాతం పున్నూతో కలిసి నటిస్తా అని చెప్పుకొచ్చాడు. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూసి నిర్మాతలు వీళ్ళిద్దరినీ పెట్టి సినిమా ప్లాన్ చేస్తాడా? ఇది అసలు అయ్యే పనేనా? బిగ్ బాస్ ఫేమ్ తో సినిమా అవకాశాలు వచ్చేస్తాయా?

సెకండ్ సీజన్ లో విపరీతమైన హైప్ తెచ్చుకుని జనాల్లో బలమైన ముద్ర వేయగలిగిన కౌశల్ కే ఎటువంటి అవకాశాలు రాక తిరిగి సీరియల్స్ లో నటిస్తున్నాడు. దీనిపై విపరీతంగా ట్రోల్స్ కూడా పడ్డాయి. రాహుల్, పున్నూతో సినిమా అంట, నిర్మాతలు ఎవరైనా వింటున్నారా మరి?.