బిగ్‌బాస్ కంటెస్టెంట్ నోయెల్‌కి ఏమైంది?


Bigg BossTelugu4 : Noel sean walks out of the house
Bigg BossTelugu4 : Noel sean walks out of the house

బిగ్‌బాస్ సీజ‌న్ 4 గ‌త రెండు వారాల నుంచి ర‌స‌వ‌త్త‌ర మ‌లుపు తిరిగింది. సీజ‌న్ పై వీవ‌ర్స్‌లో ఆస‌క్తిని పెంచింది. ఈ స‌మ‌యంలో కంటెస్టెంట్ నోయెల్ సేన్ బ‌య‌టికి రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. హౌస్‌లో యాక్టీవ్‌గా వుంటూ టాస్క్‌ల‌లో చురుగ్గా పాల్గొన్న నోయెల్ ఉన్న‌ట్టుండి డ‌ల్ అయిపోయాడు. చాలా నీర‌సంగా మారిపోయాడు. దీంతో ఏం జ‌రుగుతుందో ఇంటి స‌భ్యుల‌కు అయోమ‌యంగా మారింది.

ఇటీవ‌ల ఆరోగ్య కార‌ణాలతో హౌస్‌లో ఇమ‌డ‌లేక యూట్యూబ్ స్టార్ గంగ‌వ్వ ఇంటిదారి ప‌ట్టిన విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ అదే త‌ర‌హాలో హౌస్‌మేట్ నోయెల్ ఇంటిదారి ప‌ట్ట‌డం ఇంటిస‌భ్యుల్ని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. నోయెల్ అభ్య‌ర్థ‌న మేర‌కు బిగ్‌బాస్ టీమ్ అత‌నికి హౌస్‌లోనే ట్రీట్‌మెంట్ చేయించారు. కానీ అత‌నికి హాస్పిట‌ల్ ట్రీట్‌మెంట్ అవ‌స‌ర‌మ‌ని తేల‌డంతో ఇంటి స‌భ్యుల్ని షాక్ కు గురిచేసింది.

దీంతో ఆరోగ్య కార‌ణాల దృష్ట్యా నోయెల్ ని బిగ్‌బాస్ బ‌య‌టికి పంపించేశారు. గురువారం నోయెల్ హౌస్ నుండి బ‌య‌టికి వ‌చ్చేశాడు. విష‌యం తెలిసి హౌస్‌లో అత‌ని క్లోజ్ ఫ్రెండ్స్ క‌న్నీటితో వీడ్కోలు ప‌ల‌క‌డం కొంత మందిని క‌లిచి వేసింది. నోయెల్ కుదురుకున్నాక మ‌ళ్లీ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తాడా?  లేదా? అన్న విష‌యంలో మాత్రం క్లారిటీ లేదు.