బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ రివ్యూ


bilal pur police station movie review

బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ రివ్యూ :

నిర్మాణ సంస్థ – ఎంఎస్ క్రియేషన్స్

నటీనటులు – మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘన, గోరటి వెంకన్న, ప్రణవి, ఆర్ ఎస్ నందా, వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తదితరులు

సాంకేతిక వర్గం – సినిమాటోగ్రఫీ – తోట వి రమణ, ఎడిటింగ్ – ఎస్ బీ ఉద్ధవ్, సంగీతం – సాబూ వర్గీస్, రీ రికార్డింగ్ – జీబూ, డీటీఎస్ – రాజశేఖర్, పాటలు – గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, రామాంజనేయులు, మౌనశ్రీ మల్లిక్, నీల నర్సింహా,

కథా, నిర్మాత – మహంకాళి శ్రీనివాస్,

రచన, దర్శకత్వం – నాగసాయి మాకం.

 

విభిన్న కథా చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుండటంతో ఆ చిత్రాల హవా నడుస్తోంది. ఆ కోవలో వచ్చిన చిత్రమే బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ . రేపు ఈ సినిమా విడుదల అవుతుండగా మీడియాకు ముందుగానే షో వేశారు. ఇక ఆ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దామా !

కథ :

బిలాల్ పూర్ అనే ఊరికి పోలీస్ అధికారి గా వస్తాడు సూర్య ( మాగంటి శ్రీనాథ్ ) . ఉన్నత ఆశయాలతో వచ్చిన సూర్య కు అక్కడ చిన్న చిన్న విషయాలకు పోలీస్ స్టేషన్ కు వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉండటంతో చికాకు పడతాడు సూర్య. అయితే అదే పోలీస్ స్టేషన్లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ సురేందర్ (గోరేటి వెంకన్న  ) కూతురు శ్రీలత ని ప్రేమిస్తాడు. శ్రీలత కూడా సూర్యని ప్రేమిస్తుంది. అయితే అదే సమయంలో బిలాల్ పూర్ లో ఊహించని సంఘటనలు జరుగుతాయి. అక్కడ జరిగిన సంఘటనలు ఏంటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల ప్రతిభ..

బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రానికి ఆయువు పట్టులా నిలిచారు గాయకుడు గోరటి వెంకన్న. హెడ్ కానిస్టేబుల్ సురేందర్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక పోలీస్ ఆఫీసర్   సూర్యగా మాగంటి శ్రీనాథ్ బాగా నటించాడు. అధికారికి ఉండాల్సిన లక్షణాలు శ్రీనాధ్ నటనలో కనిపించాయి. శాన్వీ మేఘన అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది.  ఆర్ ఎస్ నందా నటించిన  సన్నివేశాలన్నీ నవ్వులు పూయించాయి. వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితనం

బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రాన్ని ఆద్యంతం  వినోదాత్మకంగా మలచడంలో  దర్శకుడు నాగసాయి మాకం విజయం సాధించారు. కొత్త దర్శకుడైనా ఎక్కడా తడబడకుండా వాణిజ్య అంశాలను మేళవించి ఈ సినిమాను రూపొందించారు. నటీనటుల నుండి మంచి నటనని రాబట్టుకున్నాడు.  తోట వి రమణ సినిమాటోగ్రఫీ సినిమాకు  హైలైట్ గా  నిలిచింది. గ్రామీణ  అందాలను  తన కెమెరాలో బందించాడు. పోలీస్ గొప్పదనం చెబుతూ సుద్దాల అశోక్ తేజ రాసిన నిద్దుర లేని కళ్లకు అడ్రస్, అలసట లేని కాళ్లకు సిలబస్ అనే పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.  సాబూ వర్గీస్ సంగీతం కథకు మరింత బలాన్నిచ్చింది. ఎంఎస్ క్రియేషన్స్ సంస్థ  నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాత మహంకాళీ శ్రీనివాస్ కు తొలి చిత్రమైనా మంచి  అభిరుచితో సినిమా చేసాడు .

ఓవరాల్ గా ….

విభిన్న తరహా సినిమా కావాలని కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్.