బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ కొత్తతరహా చిత్రమట


bilal pur police station special song బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ కొత్త తరహా చిత్రమని , తెలుగు సినిమాకు కొత్తతరహా దారిని చూపించే చిత్రమని అంటున్నాడు రచయిత , గాయకుడు గోరెటి వెంకన్న . మాగంటి శ్రీనాథ్ – మేఘన జంటగా నాగసాయి మాకం దర్శకత్వంలో మహంకాళి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ” బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ ”. గోరెటి వెంకన్న ఈ చిత్రంలో నటించడమే కాకుండా పాట కూడా రాసాడు కాగా ఆ పాటని నిన్న హైదరాబాద్ లో విడుదల చేసారు . ఈ కార్యక్రమానికి ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ ముఖ్య అథితి గా హాజరయ్యాడు .

దాదాపు 200 ల పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరిగి రకరకాల కేసులో గురించి పరిశోధించి ఈ కథని రెడీ చేసుకున్నానని , వినోద ప్రధానంగా చిత్రం సాగుతుందని ……. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు దర్శకుడు నాగసాయి మాకం . మట్టి వాసన పరిమళాలను అందించడంలో గోరెటి వెంకన్న ది అందవేసిన చెయ్యి దాంతో ఈ చిత్రంలో గాయకుడిగా , పాటల రచయితగానే కాకుండా నటుడిగా కూడా తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నాడు . చిన్న చిత్రాలు సంచలన విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో తమ బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రం కూడా పెద్ద విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ చిత్ర బృందం .

English Title: bilal pur police station special song