బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంలో యంగ్ టీచర్ గా కనిపిస్తా.. – శాన్వీ మేఘన


bilalpur police station movie press meet

ప్రముఖ గాయకుడు గోరటి వెంకన్న కూతురుగా నటించడం గౌరవంగా  భావిస్తున్నట్లు చెప్పింది యువ నాయిక శాన్వీ మేఘన. ఆమె హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ మార్చి 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత మహంకాళీ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా…నాగసాయి మాకం దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పనిచేసిన అనుభవాలను హీరోయిన్ శాన్వీ మేఘన తెలుపుతూ….నేను తెలుగు అమ్మాయినే. హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి నటిని కావాలని ఆశగా ఉండేది. జయసుధ గారు నిర్మించిన ఓ సీరియల్ లో నటించాను.

ఆ తర్వాత తెలంగాణ టామ్ బాయ్ అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాను. హీరోయిన్ గా నేను నటించిన తొలి చిత్రం బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. నా తొలి చిత్రం విడుదలవుతుందంటే ఎంతో సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో యంగ్ టీచర్ గా కనిపిస్తాను. గోరటి వెంకన్న కూతురు పాత్ర నాది.

తెలంగాణ యాసలో సినిమా సాగుతుంది. ప్రేక్షకులు మెచ్చే యాక్షన్, డ్రామా, లవ్, మెసేజ్ లాంటి అన్ని అంశాలతో దర్శకులు నాగసాయి మాకం ఈ చిత్రాన్ని రూపొందించారు. అన్ని షేడ్స్ ఉన్న చిత్రమిది. మహబూబ్ నగర్ పరిసరాల్లో మేము చిత్రీకరించిన ఒక పాట అద్భుతంగా ఉంటుంది. నిర్మాత మహంకాళీ శ్రీనివాస్ ఎవరికీ ఇబ్బంది లేకుండా సినిమాను పూర్తి చేశారు. ప్రస్తుతం నేను సైరా నరసింహారెడ్డిలో వసంత అనే పాత్రలో నటిస్తున్నాను. చిరంజీవి గారి చిత్రంలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎదురీత అనే మరో చిత్రంలోనూ సెకండ్ లీడ్ గా నటిస్తున్నాను. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ విడుదల కోసం ఎదురుచూస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నా. అన్నారు.