పోలీసంటే రియల్ హీరో…


bilalpur police station movie release date

పోలీసులు రియల్ హీరోలు అంటున్నాడు యువ కథానాయకుడు మాగంటి శ్రీనాథ్. ఆయన హీరోగా నటించిన కొత్త చిత్రం బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహకాంళీ శ్రీనివాస్ నిర్మించారు. నాగసాయి మాకం దర్శకత్వం వహించారు. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమా ఆద్యంతం నవ్విస్తూనే ఆలోచింపజేస్తుందని శ్రీనాథ్ చెబుతున్నారు. ఆయన మాట్లాడుతూ…అంకుశం లాంటి సినిమాల నుంచి పోలీసు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వాటి సత్తా చూపిస్తున్నాయి.

 

నా దృష్టిలో పోలీసులు రియల్ హీరోలు. వాళ్లు లేకుండా ఒక్క గంట సమాజాన్ని ఊహించలేం. అనేక నేరాలు, అరాచకాలు జరుగుతాయి. అందుకే నాకు ప్రతి పోలీసు అధికారి అంటే అభిమానం. ఒక్క పోలీసులే కాదు చట్టాన్ని రక్షించే ప్రతి ఒక్కరూ హీరోలే. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ లో నేను పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటించాను. బిలాల్ పూర్ అనే ఊరికి కొత్తగా పోలీసు అధికారిగా వెళ్లిన నాకు అక్కడ ఎలాంటి వింత వింత కేసులు ఎదురయ్యాయి, అవి నన్ను ఎలా అసహనానికి గురి చేశాయి అనేది వినోదాత్మకంగా ఉంటుంది. ఈ చిత్ర గొప్పదనం ప్రతి సన్నివేశం సహజంగా సాగడమే. మన చుట్టూ జరుగుతున్న కథగా దర్శకులు నాగసాయి సినిమాను తెరకెక్కించారు. ఎంఎస్ క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఆకట్టుకునేలా ఉంటాయి. కథకు తగినట్లు నిర్మాత మహంకాళీ శ్రీనివాస్ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. నాకే కాదు సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ పేరు తీసుకొస్తుంది. అన్నారు.

 

ప్రణవి, ఆర్ ఎస్ నందా, వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – తోట వి రమణ, ఎడిటింగ్ – ఎస్ బీ ఉద్ధవ్, సంగీతం – సాబూ వర్గీస్, రీ రికార్డింగ్ – జీబూ, డీటీఎస్ – రాజశేఖర్, పాటలు – గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, రామాంజనేయులు, మౌనశ్రీ మల్లిక్, నీల నర్సింహా, కథా, నిర్మాత – మహంకాళి శ్రీనివాస్, రచన, దర్శకత్వం – నాగసాయి మాకం.