అమ్మ బయోపిక్.. మొదలైన వివాదాలు


అమ్మ బయోపిక్.. మొదలైన వివాదాలు
అమ్మ బయోపిక్.. మొదలైన వివాదాలు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా పలు కథలు సెట్స్ పైకి రాబోతున్న విషయం తెలిసిందే. ఆమె జీవిత కథను ఆధారంగా చేసుకొని రెడీ చేసుకుంటున్న స్క్రిప్ట్ లపై వివాదాలు మొదలయ్యాయి. మొదటి నుంచి అమ్మ బయోపిక్ లపై ఆరోపణలు గట్టిగానే వస్తున్నప్పటికీ రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలవ్వలేదని ఎవరు పట్టించుకోలేదు. ఇక ఫైనల్ గా జయలలిత మెనకోడలు దీప జయకుమార్ కోర్టు మెట్లెక్కారు.

ఎవరికి వారు ఇష్టానుసారంగా అమ్మ బయోపిక్ లను రెడీ చేస్తున్నారు. రేపు తెరపైకి వచ్చేసరికి తప్పుగా చూపించే ఆస్కారం లేకపోలేదు అని దీప మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు. వెంటనే ఆ ప్రాజెక్ట్ లపై విచారణ జరపాలని పిటిషన్ వేశారు. త్వరలోనే ఈ కేసుపై వివరణ రానుంది. ఇకపోతే జయ బయోపిక్ ఆధారంగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఆ సినిమాకు ఏఎల్.విజయ్ దర్శకత్వం వహించనున్నాడు.

ఇక నిత్యా మీనన్ కూడా ఒక సినిమా చేస్తోంది. జయ జీవితం గురుంచి క్లుప్తంగా వివరిస్తాను అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిత్యా క్లారిటీ ఇచ్చింది. ఆమెకు సంబంధించిన కొన్ని లుక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక గౌతమ్ మీనన్ జయ కథను వెబ్ సిరీస్ ద్వారా ప్రజెంట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎవరికి వారు ప్లానింగ్ తో రెడీ అవుతున్నారు. కానీ ఇంకా ఎవరు షూటింగ్ స్టార్ట్ చేయలేదు. ఇక ఇప్పుడు దీప కాంట్రవర్సీ బయోపిక్ లను కోర్టుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. మరి కోర్టు ఈ ప్రాజెక్ట్ లపై ఎలాంటి తీర్పును ఇస్తుందో చూడాలి.