బీజేపీ కి మరో షాక్ ఆసుపత్రి పాలైన మరో నేత


Murli Manohar Joshi
Murli Manohar Joshi

భారతీయ జనతా పార్టీ కి షాక్ మీద షాక్ తగులుతోంది, ఇప్పటికే బీజేపీ సీనియర్ నాయకులైన సుష్మా స్వరాజ్ , అరుణ్ జైట్లీ మరణించడంతో తీవ్ర షాక్ లో ఉన్న బీజేపీ క్యాడర్ కు మరో షాకింగ్ న్యూస్ తగిలింది. సీనియర్ నాయకుడు మురళీమనోహర్ జోషి అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు.

అరుణ్ జైట్లీ అంత్యక్రియలు అయిన కొద్దిసేపటికే మురళీమనోహర్ జోషి ఆసుపత్రి పాలయ్యాడన్న వార్త దావానలంలా వ్యాపించింది. మురళీమనోహర్ జోషి భారతీయ జనతా పార్టీలో అగ్ర నేత అన్న విషయం తెలిసిందే. అటల్ బిహారి వాజ్ పేయి , లాల్ కృష్ణ అద్వానీ ల తర్వాత అంతటి స్థానం దక్కించుకున్న నేత మురళీమనోహర్ జోషి కావడం విశేషం.

భారతీయ జనతా పార్టీకి రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్నాడు అలాగే వాజ్ పేయి ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేసాడు జోషి. ఇప్పటికే ఇద్దరు అగ్రనేతలు మరణించడంతో శోక సంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ శ్రేణులకు జోషి ఆసుపత్రి పాలయ్యాడన్న వార్త కలిచి వేస్తోంది.