రాజమౌళి రాజకీయ నిర్ణయం తీసుకోనున్నాడా


bjp leaders eyes on director ss rajamouli ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రాజకీయ నిర్ణయం తీసుకోనున్నాడా ? భారతీయ జనతా పార్టీ వైపు అతడి చూపులున్నాయా ? రానున్న రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో రాజమౌళి రాజకీయ నిర్ణయం తీసుకుంటాడా ? దర్శకులు రాజమౌళి పై రకరకాల మాటలు వినిపిస్తున్నాయి . రాజమౌళి పై ఇంతగా ఆసక్తి కలగడానికి కారణం ఏంటంటే ఇటీవలే భారతీయ జనతా పార్టీ కి చెందిన నాయకులు కలవడం . 2019 లో ఎన్నికలు ఉన్నందున ప్రధాని మోడీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే మీలాంటి వాళ్ళ మద్దతు అవసరం అంటూ దేశ వ్యాప్తంగా కొంతమంది ప్రముఖులను దువ్వే పనిలో పడ్డారట భారతీయ జనతా పార్టీ నేతలు .

అందులో భాగంగానే ఎస్ ఎస్ రాజమౌళి ని కలిసినట్లుగా తెలుస్తోంది . అయితే రాజమౌళి మాత్రం ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకునేలా లేడట ఎందుకంటే అతడికి రాజకీయాల కన్నా సినిమాలపైనే ఆసక్తి కాబట్టి . పైగా ఇప్పుడు ఎన్టీఆర్ – చరణ్ లతో భర్తీ ఎత్తున మల్టీస్టారర్ సినిమా చేయనున్నాడు కాబట్టి జక్కన్న కు కుదరకపోవచ్చు . అలాగే చంద్రబాబు ని కాదని భారతీయ జనతా పార్టీ కి మద్దతు పలకడం కూడా కష్టమే అనుకుంటా !