బాలకృష్ణ దిష్టిబొమ్మ దహనం


bjp leaders fire on balakrishna comments

నందమూరి బాలకృష్ణ ప్రధాని మోడీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ ఎత్తున బిజెపి కార్యకర్తలు బాలయ్య దిష్టి బొమ్మలను దహనం చేసారు . అయితే బాలయ్య దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారని తెలియడంతో టిడిపి కార్యకర్తలు , బాలయ్య అభిమానులు బిజెపి నేతలపై దాడికి దిగారు దాంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి .

ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు బాలయ్య దిష్టి బొమ్మల దహన కార్యక్రమం చేపట్టారు అయితే అదే సమయంలో టిడిపి శ్రేణులు బిజెపి కార్యకర్తలతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది . పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు . బాలయ్య ఉండాల్సింది అసెంబ్లీ లో కాదని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి లో అని తీవ్ర విమర్శలు చేస్తున్నారు బిజెపి నాయకులు .