సీత చిత్రాన్ని బ్యాన్ చేయాలంటున్నారు


కాజల్ అగర్వాల్ నటించిన సీత చిత్రాన్ని బ్యాన్ చేయాలనీ ఆందోళనకు దిగుతున్నారు భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు . సీత పేరుకి ఎంతో పవిత్రత ఉంది అయితే అలాంటి సీత టైటిల్ తో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ మోడ్రన్ సీత గా నటించింది . డబ్బు కోసం సహజీవనం చేయడానికి రెడీ అయ్యే క్యారెక్టర్ పోషించింది కాజల్ దాంతో ఎంతో పవిత్రమైన పేరు పెట్టి ఇలా హిందువుల మనోభావాలను కించపరిచేలా ఎలా తీస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హిందువులు .

అంతేకాదు ఫిలిం ఛాంబర్ వద్ద ఆందోళన కు సిద్ధం అయ్యారు , సీత చిత్రాన్ని బ్యాన్ చేయాల్సిందే అని పట్టుబడుతున్నారు కూడా . అయితే రేపు ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో వీళ్ళ ఆందోళనని ఎవరూ పట్టించుకోవడం లేదు పాపం . కాజల్ అగర్వాల్ – బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జంటగా నటించిన సీత చిత్రాన్ని ఈనెల 25 న విడుదల చేస్తున్నారు .