హీరో శివాజీ పై దాడి


bjp supporters attacks on hero sivaji

హీరో శివాజీ పై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు అయితే సకాలంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు శివాజీ . గతకొంత కాలంగా భారతీయ జనతా పార్టీ పై నిప్పులు చెరుగుతున్నాడు శివాజీ . ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చి ఆ హామీ ని తుంగలో తొక్కిందని ఆ పార్టీ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాడు శివాజీ దాంతో శివాజీ ని టార్గెట్ చేసారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు .

ఈ సంచలన సంఘటన విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ లో జరిగింది , ఆంధ్రప్రదేశ్ శాఖా అధ్యక్షుడి గా నియమాయమైన తర్వాత ఢిల్లీ వెళ్లి విజయవాడ వస్తున్నాడు కన్నా లక్ష్మీనారాయణ దాంతో అతడికి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి భాజపా కార్యకర్తలు తరలివచ్చారు . కాగా అదే సమయంలో హీరో శివాజీ గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో అతడి పై దాడి చేయడానికి ఉపక్రమించారు , భారతీయ జనతా పార్టీ ని విమర్శిస్తే సహించేది లేదని శివాజీ ని హెచ్చరించారు కార్యకర్తలు . అయితే దాడులకు నేను భయపడేది లేదంటూ శివాజీ అంటున్నాడు .