డైరెక్టర్ పై దాడి


bjp workers try to attacks on director ameer

తమిళ దర్శకులు అమీర్ పై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాడి చేసారు , అయితే ఆ దాడి లో అమీర్ తప్పించుకున్నాడు . డైరెక్టర్ అమీర్ ప్రయాణిస్తున్న కారు అనుకొని ఆ కారుపై రాళ్ల దాడి చేసారు అయితే ఆ కారులో దర్శకులు అమీర్ కాకుండా ఇతరులు ఉండటంతో రాళ్ల దాడి ని ఆపేసి అక్కడి నుండి పారిపోయారు ఆందోళనకారులు . సంఘటన వివరాలలోకి వెళితే ……. శుక్రవారం రోజున ఓ సంస్థ రాజకీయ చర్చా వేదిక ఏర్పాటు చేసారు కాగా ఆ చర్చా వేడుకలో అమీర్ పాల్గొన్నాడు .

ఆ చర్చ లో భాగంగా దర్శకులు అమీర్ రజనీకాంత్ పార్టీ కి మద్దతుగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పై విమర్శలు గుప్పించాడు దాంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కోపం వచ్చింది అక్కడే దర్శకులు అమీర్ పై దాడికి ప్రయత్నించారు దాంతో ఎక్కడ పరిస్థితి అదుపు తప్పుతుందో అని భావించిన నిర్వాహకులు వెంటనే అమీర్ ని పంపించారు . అయితే అమీర్ వెళ్తున్న సమాచారం అందుకున్న కార్యకర్తలు పొరపాటున మరో కారు అమీర్ ప్రయాణిస్తున్న కారు అనుకొని రాళ్ల దాడికి పాల్పడ్డారు . అయితే కారులో ఉన్నవాళ్లు భయాందోళనకు గురై బయటకు రావడంతో అందులో అమీర్ లేడని నిర్దారించుకుని అక్కడి నుండి పారిపోయారు . అదే కార్లో అమీర్ ఉంటే పరిస్థితి మరోలా ఉండేది .