అల్లు అర్జున్ పాటని రీమిక్స్ చేస్తున్న విశాల్


Block buster song remix for Vishal ayogya 

తమిళ స్టార్ హీరో విశాల్ తాజాగా టెంపర్ చిత్రాన్ని అయోగ్య పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే . 2015 లో రిలీజ్ అయిన ఎన్టీఆర్ టెంపర్ సూపర్ హిట్ అయ్యింది కాగా ఆ చిత్రాన్ని తమిళ్ లో రీమేక్ చేస్తున్నాడు విశాల్ . కాగా ఆ రీమేక్ చిత్రంలో అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రంలోని బ్లాక్ బస్టర్ అనే పాటని రీమేక్ చేయనున్నాడు విశాల్ .

 

అల్లు అర్జున్ – అంజలి ఈ బ్లాక్ బస్టర్ అనే ఐటెం సాంగ్ లో స్టెప్స్ వేయగా తమిళ చిత్రంలో మాత్రం విశాల్ తో పాటు ఆడి పాడేది మాత్రం శ్రద్దా దాస్ . సరైనోడు చిత్ర రీమేక్ హక్కులు కూడా విశాల్ దగ్గరే ఉన్నాయి దాంతో ఆ చిత్రంలోని పాటని అయోగ్య కోసం వాడుకుంటున్నాడు . ఎన్టీఆర్ కు సూపర్ హిట్ నిచ్చిన టెంపర్ విశాల్ కు ఎలాంటి హిట్ నిస్తుందో చూడాలి .

English Title: Block buster song remix for Vishal ayogya