లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్ కోసం బోల్డ్ భామ


లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్ కోసం బోల్డ్ భామ
లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్ కోసం బోల్డ్ భామ

ఈ మధ్య సినిమాల కంటే వెబ్ సిరీస్ ల మీదే ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. అటు సినీ దర్శకులు, నటీనటులు సైతం వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా ఈ పోకడ హిందీలో ఎక్కువగా ఉంది. అలా హిందీలో హిట్ అయిన ఒరిజినల్స్ లో లస్ట్ స్టోరీస్ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి.

నాలుగు భిన్న నేపధ్యాల కథను ఇందులో డీల్ చేసిన విధానం అదిరిపోతుంది. ఈ ఒరిజినల్స్ లో నాలుగు భిన్న నేపధ్యాలను నలుగురు అగ్ర దర్శకులు తెరకెక్కించిన సంగతి తెల్సిందే. ఇప్పుడు ఈ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ ‘లస్ట్ స్టోరీస్‘ కు తెలుగు వెర్షన్ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈ ఒరిజినల్ ను నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి, సందీప్ రెడ్డి తెరకెక్కిస్తారు. రోనీ స్క్రవాలా ఈ ఒరిజినల్ ను నిర్మిస్తారు.

నందిని రెడ్డి తెరకెక్కించే సెగ్మెంట్ లో బోల్డ్ బ్యూటీ అమలా పాల్ నటిస్తుంది. హిందీ వెర్షన్ లో ఈ రోల్ ను కియారా అద్వానీ అత్యంత బోల్డ్ గా నటించి అందరి దృష్టిలో పడింది. ఈ సెగ్మెంట్ లో స్వయంతృప్తి పొందే ఒక సీన్ పై జనాల్లో విపరీతమైన చర్చ కూడా జరిగింది. మరి తెలుగు వెర్షన్ లో కూడా ఆ బోల్డ్ నెస్ ను అలాగే ఉంచుతారా లేక కొంచెం తగ్గిస్తారా అనేది చూడాలి. ఈ ఒరిజినల్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.