23న బుల్లితెరపై బోల్డ్ సినిమా

Bold movie RX100 on small screen
Karthikeya , Payal rajput

చిన్న చిత్రంగా విడుదలై ప్రభంజనం సృష్టించిన చిత్రం ” ఆర్ ఎక్స్ 100పాయల్ రాజ్ పుత్కార్తికేయ జంటగా నటించిన ఈ చిత్రం బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కింది . రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఎక్స్ 100 రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది . కానీ వసూళ్ల పరంగా 25 కోట్ల వసూళ్ల ని సాధించింది అలాగే డబ్బింగ్ , శాటిలైట్ రైట్స్ , డిజిటల్ రైట్స్ రూపంలో మరో పది కోట్లని రాబట్టింది . దాంతో 2 కోట్ల ఈ సినిమా 35 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది .

ఇక ఈ బోల్డ్ సినిమాని ఈ ఆదివారం  డిసెంబర్ 23 న స్టార్ మా ఛానల్ లో సాయంత్రం ప్రసారం చేయనున్నారు . ఆమేరకు అధికారికంగా స్టార్ మా ట్వీట్ చేసింది కూడా . అయితే బోల్డ్ కంటెంట్ ఉన్న ఈ సినిమాలో బుల్లితెర పై వేయాలంటే తప్పకుండా చాలా సన్నివేశాలను తొలగించాలి . మరి ఎన్ని సన్నివేశాలను తొలగించారో ఏంటో ? తెలియాలంటే ఈనెల 23 వరకు ఎదురు చూడాల్సిందే .

English Title: Bold movie RX100 on small screen