ఆ హాస్య నటుడికి జైలు శిక్ష తప్పదా


bollywood actor rajpal yadav  in chequebounce caseఫైనాన్షియర్ అగర్వాల్ దగ్గర అయిదు కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని చెల్లించకపోవడంతో అతడు కోర్టుని ఆశ్రయించగా ఢిల్లీ కోర్టు హాస్య నటుడి ని దోషి గా తేల్చింది , మరో పదిరోజుల్లో శిక్ష ఖరారు చేయనుంది ఢిల్లీ కోర్టు . సంఘటన వివరాలలోకి వెళితే ……. రాజ్ పాల్ యాదవ్ అనే బాలీవుడ్ హాస్య నటుడు పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించాడు . అయితే సినిమా తీయాలని భావించిన రాజ్ పాల్ యాదవ్ తన భార్య రాధ తో కలిసి యాక్సిస్ బ్యాంక్ లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసాడు .

ఎం జి అగర్వాల్ వద్ద 5 కోట్లు సినిమా కోసం అప్పుగా తీసుకున్నారు అయితే తీసుకున్న అప్పు ని సకాలంలో అగర్వాల్ కు చెల్లించక పోవడంతో కోర్టు ని ఆశ్రయించాడు అగర్వాల్ . దాంతో ఢిల్లీ లోని కర్ కర్ డుమా కోర్టు అదనపు మేజిస్ట్రేట్ రాజ్ పాల్ యాదవ్ ని అతడి భార్య రాదని దోషులుగా తేల్చారు అయితే రాజ్ పాల్ యాదవ్ కు ఎలాంటి శిక్ష విధించనున్నారో మాత్రం ఏప్రిల్ 23న తేలనుంది . శిక్ష ఖరారు అయితే రాజ్ పాల్ యాదవ్ జైలు కెళ్ళడం ఖాయం .