ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ నటుల హంగామా


ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ నటుల హంగామా
ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ నటుల హంగామా

బాహుబలితో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక మీదట చేయాలన్నా కానీ ప్రభాస్ రీజినల్ సినిమాలు చేయలేడు. బాహుబలి తర్వాత మినిమం బడ్జెట్ లో సాహో చేయాలని చూసినా కానీ పనవ్వక బడ్జెట్ పెంచి ప్యాన్ ఇండియా మూవీగా చేయాల్సి వచ్చింది. బడ్జెట్ పెరిగి అదనపు హంగులు తోడయ్యాయి కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే విషయంలో ప్రేక్షకులను అలరించడంలో విఫలమవడంతో సాహో దారుణమైన ప్లాప్ గా మిగిలింది. పెరిగిన బడ్జెట్ కాస్తా సినిమాకు నెగటివ్ ఫ్యాక్టర్ అయింది. దర్శకుడు సుజీత్ కు అనుభవం లేకపోవడం కూడా ఈ ప్లాప్ కు ప్రధాన కారణంగా చెప్పుకున్నారు.

అయితే ప్రభాస్ మరో అనుభవం పెద్దగా లేని దర్శకుడితో సినిమా కమిటయ్యాడు. జిల్ సినిమాను తెరకెక్కించిన రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమాకు రాధే శ్యామ్ అనే టైటిల్ ను అనుకుంటున్న సంగతి తెల్సిందే. సాహోకు జరిగిన తప్పులు ఈ సినిమాకు జరగకుండా చూస్తున్నారు ప్రభాస్ అండ్ కో. అందుకే అప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయినా కానీ స్క్రిప్ట్ విషయంలో, బడ్జెట్ విషయంలో రీ వర్క్ చేసారు. అంతా సెట్ అయింది అనుకున్నాకే సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు.

పూజ హెగ్డే ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈమెకు బాలీవుడ్ లో ప్రస్తుతం మంచి బజ్ ఉంది. అలాగే ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్ళే కాకుండా క్యారెక్టర్ రోల్స్ కు కూడా కొంత మంది బాలీవుడ్ నటులను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇలా అయితే ప్యాన్ ఇండియా లెవెల్లో అందరికీ చేరువ కావొచ్చు అన్నది ఐడియా. సాహో విషయంలో కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు.

ప్రస్తుతం రాధే శ్యామ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో స్పెషల్ గా వేసిన లేక్ సెట్ లో కొనసాగుతోంది. ప్రభాస్, పూజల మధ్య బోట్ సీక్వెన్స్ కు సంబంధించిన షూటింగ్ చేస్తున్నారు. దీని తర్వాత అదే స్టూడియోలో ట్రైన్ సెట్ లో షూటింగ్ ను కొనసాగించనున్నారు .