నిర్మాత డబ్బులు ఇచ్చాను అంటున్నాడు…హీరోయిన్ అంత అబద్దం అంటుంది


Ameesha Patel
Ameesha Patel

సినిమా నిర్మాణ రంగంలో రోజుకు ఒక సమస్య తలెత్తుతుంది. కొంతమంది సామరస్యంగా పరీష్కరించుకుంటే కొంతమంది గొడవ, ఆర్బాటం చేసి రోడ్డు మీదికి ఎక్కేస్తారు. బాలీవుడ్ లో ఇప్పుడు నిర్మాతకి, హీరోయిన్ కి ఇలాంటి సమస్య ఎదురైంది. ఇద్దరు పరస్పరం ఆ గొడవల ని ఎక్కువ చేసుకుంటున్నారు. మరి ఇలా జనాల మధ్య  గొడవ గురించి మాట్లాడుకోవడం మంచిదేనా? అంటున్నారు బాలీవుడ్ జనాలు.

బాలీవుడ్, టాలీవుడ్ లో ఒక మెరుపు తీగలాగా వచ్చి సినిమాలు చేసేసింది అమీషా పటేల్. తెలుగులో మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోలతో నటించింది. హిందీలో కూడా దాదాపు పెద్ద హీరోల తరుపున, కుర్ర హీరోలతో కూడా నటించింది. గత కొంతకాలంగా సినిమాల నుండి ఆఫర్లు రాక చిన్న చిన్న పాత్రలు, ప్రోగ్రామ్ లు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తుంది.

బాలీవుడ్ నిర్మాత అజయ్ కుమార్ కి, అమీషా పటేల్ కి ఇప్పుడు పెద్ద గొడవే జరుగుతుంది. ఇద్దరిలో తప్పు ఎవరిదో తెలవదు కానీ సమస్య మాత్రం ఇప్పుడు జనాల దగ్గరికి వచ్చింది. అజయ్ కుమార్ గారేమో ‘దేశి మ్యూజిక్’ సినిమాకి అప్పుగా నా దగ్గరనుండి  2.5 కోట్లు అప్పుగా తీసుకుంది…..కనీసం ఆ సినిమాలో అయినా నటించిందా? అంటే నటించనేలేదు, పైగా డబ్బులు తిరిగి ఇవ్వాలి అని నేను అడిగితే నా మీదకి జనాలని పంపి నన్ను బెదిరించింది. నేను  పోలీస్ స్టేషన్ లో మరియు కోర్ట్ లో కేసు వేసాను. కోర్ట్ వెంటనే అమీషా గారికి నోటీసులు పంపించింది అని అన్నారు.

ఈ విషయం తెలుసుకున్న అమీషా పటేల్ వెంటనే ట్విట్టర్ లో ‘అజయ్ కుమార్ నా మీద కేసు పెట్టడం కేవలం సింపతీ కోసం చేస్తున్న ప్రయత్నం అని, నేను దీని మీద న్యాయంగా పోరాడాలి అనుకున్నాను, నా ఫ్యాన్స్ ఎవ్వరు నన్ను తప్పుగా అర్ధం చేసుకోకండి. నా మీద వస్తున్న ఆరోపణల వలన ఈ రోజు ట్విట్టర్ వేదికగా మాట్లాడుతున్నాను, దీంట్లో నా తప్పు ఏమి లేదు’ అని పలికారు.

మరి ఒక వైపు వాదన విని కోర్ట్ అమీషా గారికి నోటీసులు పంపడం, అమీషా పటేల్ గారేమో అలాంటిది ఏమి లేదు అని అనడంతో అక్కడే జనాలు ఆలోచించడానికి మంచి సమస్య దొరికింది అని బాలీవుడ్ వార్తలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. కేసు విచారణకి వెళ్ళింది కదా తప్పు ఎవరిదో తొందరలోనే తెలుస్తుంది అని అనుకుంటున్నారు.