వ్యభిచారం చేస్తూ పట్టుబడిన నటి


bollywood actress caught in prostitution

బాలీవుడ్ నటి వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది దాంతో ఆమెతో పాటు విటుడిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు . వ్యభిచారం జంట నగరాలలో పెద్ద ఎత్తున జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ , అరెస్ట్ చేస్తున్నప్పటికీ ఈ వ్యభిచార దందా మాత్రం ఆగడం లేదు . ఇప్పటికే పలువురు నటీమణులను అరెస్ట్ చేసారు పోలీసులు కాగా తాజాగా బాలీవుడ్ నటిని అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది .

అయితే ఆ బాలీవుడ్ నటి ఎవరు ? అన్నది మాత్రం పోలీసులు చెప్పలేదు . హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ,అలాగే సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్ లోని రాడిసన్ బ్ల్యూ హోటల్ లో జోరుగా వ్యభిచారం సాగుతోందని పోలీసులకు సమాచారం అందడంతో పక్కా ప్లాన్ ప్రకారం పోలీసులు దాడులు నిర్వహించి బాలీవుడ్ నటి తో పాటు విటుడిని నిర్వాహకులను అరెస్ట్ చేసారు .

ప్రస్తతం బాలీవుడ్ నటి పోలీసుల అదుపులో ఉంది , కేసు నమోదు కు పోలీసులు సిద్ధమయ్యారు . దాంతో ఆ నటి కొద్దిరోజులు ఇబ్బంది పడక తప్పదు . ఈజీ మనీ కోసం ఇలా పక్కదార్లు పడుతున్నారు కొంతమంది నటీమణులు .

English Title: bollywood actress caught in prostitution