ఆత్మహత్య చేసుకున్న డ్యాన్స్ మాస్టర్


bollywood choreographer committed suicideబాలీవుడ్ లో పలు చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్ గా వ్యవహరించిన అభిజిత్ షిండే ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ సంఘటన సంచలనం సృష్టించింది . గతకొంత కాలంగా తీవ్ర మానసిక ఆవేదనతో బాధపడుతున్నాడు , కొంతకాలంగా భార్య తో విబేధాలు రావడంతో భార్య నాలుగు నెలలకు పైగా దూరంగా ఉంటోంది . దాంతో మరింతగా డిప్రెషన్ కి లోనయ్యాడు ఆ ఆవేదనతోనే ఆత్మహత్య కు పాల్పడినట్లు తెలుస్తోంది . అయితే ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ రాసి పెట్టాడు , దాని ప్రకారం తన యావదాస్థి తన కూతురు కి మాత్రమే చెందాలని భార్య కు నయాపైసా కూడా ఇవ్వొద్దని రాసాడు .

భార్య తో ఉన్న విభేదాలతోనే అభిజిత్ షిండే సూసైడ్ చేసుకున్నాడని నిర్దారణకు వచ్చిన పోలీసులు అభిజిత్ షిండే మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు . పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలకు ఉపక్రమించనున్నారు పోలీసులు .

English Title: bollywood choreographer committed suicide