మరోసారి బాలీవుడ్ నే ఆశ్రయిస్తోన్న చిరు – చరణ్


మరోసారి బాలీవుడ్ నే ఆశ్రయిస్తోన్న చిరు - చరణ్
మరోసారి బాలీవుడ్ నే ఆశ్రయిస్తోన్న చిరు – చరణ్

మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రం సైరా నరసింహారెడ్డికి మొదట ఏఆర్ రెహమాన్ ను ఎంచుకున్నారు. అయితే రెహమాన్ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి వాకౌట్ చేసినప్పుడు తెలుగు సంగీత దర్శకులు మణిశర్మ, కీరవాణి వంటి వారిని అప్రోచ్ అవుతారని అందరూ భావించారు. అయితే చిరంజీవి, చరణ్ బాలీవుడ్ సంగీత దర్శకుణ్ణి ఎంచుకున్నారు. అమిత్ త్రివేది సంగీత పరంగా యావరేజ్ గానే నిలిచింది.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా వేరే సంగీత దర్శకుడి చేత చేయించుకున్నా దానికి కూడా పూర్తి పాజిటివ్ రిపోర్ట్స్ రాలేదు. అయితే చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ఉంటుంది కాబట్టి దానికి దేవి శ్రీ ప్రసాద్ పని చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ సినిమా ముహూర్తం అప్పుడు దేవి అక్కడ లేడు, ప్రెస్ నోట్ లో కూడా దేవి ప్రస్తావన లేదు.

దీంతో దేవి శ్రీ ప్రసాద్ ను కొరటాల శివ పక్కన పెట్టాడని అర్ధమవుతోంది. మరోసారి అవకాశం మణిశర్మ, కీరవాణి లేదా ఎవరైనా తెలుగు సంగీత దర్శకులకు దక్కుతుంది అనుకుంటే మరోసారి బాలీవుడ్ వైపే చూస్తున్నారు చిరంజీవి, రామ్ చరణ్. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించబోయే చిత్రానికి బాలీవుడ్ సంగీత అజయ్ – అతుల్ పనిచేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్టా. రామ్ చరణ్, చిరంజీవిలకు ఈ బాలీవుడ్ గోల ఎలనో!!