ఆత్మహత్య చేసుకున్న రచయిత


bollywood film writer ravi shankar alok commits suicideమానసిక ఒత్తిడితో సతమతం అవుతున్న సినీ రచయిత ఆత్మహత్య కు పాల్పడ్డాడు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన నిన్న మధ్యాహ్నం ముంబై లో జరిగింది . బాలీవుడ్ నటుడు నానా పటేకర్ నటించిన ” అబ్ తక్ చపన్ ” సినిమాకు స్క్రీన్ ప్లే అందించాడు రవిశంకర్ అలోక్ . యువ కథా రచయిత ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు .

ముంబై లోని అంధేరి ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు రవిశంకర్ అలోక్ . అయితే కెరీర్ అనుకున్న స్థాయిలో పుంజుకోక పోవడంతో మానసికంగా కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నాడు , మానసిక చికిత్స కూడా తీసుకుంటున్నాడు రవిశంకర్ అయితే అది తీవ్ర స్థాయికి చేరడంతో అపార్ట్ మెంట్ పై భాగం నుండి నిన్న మధ్యాహ్నం కిందకు దూకి ఆత్మహత్య కు పాల్పడ్డాడు . సినీ వినీలాకాశంలో తారగా వెలుగొందాలని ఎన్నో ఆశలతో వస్తారు , కానీ అనుకున్న స్థాయిలో విజయం సాధించేవాళ్లు కొంతమందే !

English Title: bollywood film writer ravi shankar alok commits suicide