బాలయ్య సినిమాలో బాలీవుడ్ హీరో.. విలన్?


bollywood hero in balakrishna movie

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా డిజాస్టర్ కావడంతో నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని బాలక్రిష్ణ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త స్టైల్ ని ఫాలో అవుతున్నాడు. రూలర్ ఫస్ట్ లుక్ చూడగానే ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. స్టయిలిష్ లుక్ తో అదరగొట్టాడని పాజిటివ్ కామెంట్స్ అందుకున్నాడు.

అయితే సెకండ్ లుక్ తో బాలయ్య మరో షాక్ ఇచ్చాడు.
పోలీస్ డ్రెస్ లో సాలీడ్ గా కనిపించే బాలక్రిష్ణ ఈ సారి మాత్రం తీవ్రంగా నీరాశపరిచాడు. ట్రోలర్స్ కి అవకాశం ఇచ్చి సినిమాపై పెరిగిన బజ్ మొత్తం దిగిపోయింది. ఆ సంగతి పక్కన పెడితే రూలర్ సినిమా ఎంతవరకు క్లిక్ అవుతుందో గాని బోయపాటి శ్రీనుతో చేయబోయో సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలవాలని బాలక్రిష్ణ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
దర్శకుడు బోయపాటి బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ని బాలయ్య సినిమాలో విలన్ గా చూపించడానికి ఒప్పిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం విలన్ గా చేసేందుకు సంజయ్ సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే KGF లాంటి సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. పాత్ర నచ్చి.. రెమ్యునరేషన్ గట్టిగా ఇవ్వగలిగితే సంజయ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధమే అన్నట్లు తెలుస్తోంది. బోయపాటి సినిమాలో విలన్స్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మరి బాలక్రిష్ణ తో ఫైట్ కి ఈ స్టార్ యాక్టర్ ఒప్పుకుంటాడో లేదో..?