అర్జున్ రెడ్డి హిందీ హీరో ఎవరో తెలుసా


bollywood hero shahid kapoor as arjun reddy,తెలుగునాట సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళ్ లో తాజాగా రీమేక్ చేస్తున్నారు కాగా హిందీ లో కూడా రీమేక్ చేయాలనీ గత ఆరు నెలలుగా అనుకుంటున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కానీ హీరో కుదరలేదు ఎట్టకేలకు అర్జున్ రెడ్డి కి బాలీవుడ్ హీరో దొరికాడు . ఇంతకీ బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి గా కనిపించబోయే హీరో ఎవరో తెలుసా ……. షాహిద్ కపూర్ . బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ని ఎట్టకేలకు సందీప్ రెడ్డి వంగా ఓకే చేసాడు .

తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన విషయం తెలిసిందే . అర్జున్ రెడ్డి తో విజయ్ దేవరకొండ స్టార్ డం ఒక్కసారిగా మారిపోయింది . ఇక ఇప్పుడు మరింత జోష్ తో ఉన్నాడు అంతేకాదు స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు . ఇక అర్జున్ రెడ్డి తమిళ్ లో రీమేక్ అవుతోంది హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు అర్జున్ రెడ్డి చిత్రంతో . సందీప్ రెడ్డి వంగా తెలుగులో కాకుండా అర్జున్ రెడ్డి ని హిందీలో తీసి తన బ్రాండ్ ని దేశ వ్యాప్తం చేయాలనీ భావిసున్నాడు . తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యింది మరి హిందీలో ఎలా ఉంటుందో చూడాలి .