వరుణ్ తేజ్ కోసం బాలీవుడ్ హీరోయిన్Bollywood Heroine Kiara Advani with Varun Tej
Bollywood Heroine Kiara Advani with Varun Tej

మెగా యువ హీరో వరుణ్ తేజ్ బ్యాక్ టూ బ్యాక్స్ సక్సెస్ లతో మెల్లగా తన మార్కెట్ ని పెంచుకుంటున్నాడు. దీంతో మనోడి సినిమాల బడ్జెట్, తారాగణం రేంజ్ కూడా పెరుగుతోంది. గద్దల కొండ గణేష్ సినిమా అనంతరం వరుణ్ తేజ్ తన 10వ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది

అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీని సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వస్తోంది. ఆమె ఎవరో కాదు. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ కీయరా అద్వానీ. ఆ సినిమా అనంతరం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల బాలీవుడ్ లో అమ్మడు నటించిన కబీర్ సింగ్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ హిట్ గా నిలిచింది.
దీంతో గ్యాప్ లేకుండా అమ్మడికి ఆఫర్స్ అందుతున్నాయి. ఇక ఇటీవల బేబీకి వరుణ్ తేజ్ సినిమాకు ఆఫర్ రాగా ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్స్ లో ఉన్న కీయరా మరో సినిమా ఒకే చేయడానికి ఛాన్స్ దొరకడంలేదట. వరుణ్ తేజ్ సినిమా స్క్రిప్ట్ అయితే బాగా నచ్చిందట. దీంతో ఆ ప్రాజెక్ట్ ని వదలడానికి ఇష్టపడటం లేదు. అందుకే డేట్స్ అడ్జస్ట్ చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై ఒక క్లారిటీ రానుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమాను రినైజన్స్ సినిమాస్, బీడబ్ల్యూసీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ నిర్మించనున్నాయ్.