సినిమా ప్రమోషన్లతో కొత్త పుంతలు తొక్కుతున్న బాలీవుడ్


సినిమా ప్రమోషన్లతో కొత్త పుంతలు తొక్కుతున్న బాలీవుడ్
సినిమా ప్రమోషన్లతో కొత్త పుంతలు తొక్కుతున్న బాలీవుడ్

కంటెంట్ పరంగా మనం ఇప్పుడు బాలీవుడ్ కన్నా గొప్ప స్థాయిలో ఉన్నామనే భావన అందరిలో ఏర్పడింది. అందుకే బాలీవుడ్ వాళ్ళు మన సినిమాలన్నా , కథలన్నా, దర్శకులన్నా చెవి కోసుకుంటారని అంటుంటారు. దానికి తగ్గట్లే మనవాళ్లకు డిమాండ్ ఏర్పడింది కూడా. అయితే బాలీవుడ్ వాళ్ళు మనకన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివింది ప్రమోషన్ల విషయంలో.

అవును, మనం ఎంత చెప్పుకున్నా హిందీ సినిమాలకు ప్రమోషన్స్ జరిగినట్లు మనకు జరగవు. సినిమా రిలీజ్ కు ముందు దగ్గరిదగ్గర నెల రోజులు వాళ్ళు ప్రమోషన్స్ కే కేటాయిస్తారు. రీసెంట్ గా హౌస్ ఫుల్ 4 టీమ్ చేస్తున్న వింత ప్రచారం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రమోషన్స్ అంటే దేశవ్యాప్తంగా తిరుగుతూ ప్రచారం చేయాలి కాబట్టి హౌస్ ఫుల్ 4 నిర్మాత సాజిద్ న‌డియాడ్ వాలా ఇండియన్ రైల్వేస్ వారి నుండి ఒక లగ్జరీ రైలును రెంటుకు తీసుకున్నాడు.

ముంబై నుండి స్టార్ట్ అయ్యే ఈ రైలు అక్కడక్కడా ముఖ్యమైన గమ్యస్థానాలలో ఆగుతూ ఢిల్లీ చేరుకుంటుంది. హౌస్ ఫుల్ 4 టీమ్ ఆ గమ్యస్థానాలలో దిగుతూ సినిమాను ప్రమోట్ చేస్తారు. ప్రమోషన్ ఐడియా అదిరిపోయింది కదా. ఈ వింత ప్రచారంతో హౌస్ ఫుల్ 4 అందరినీ ఆకర్షిస్తోంది. దీపావళి కానుకగా హౌస్ ఫుల్ 4 విడుదల కానుంది.

Credit: Twitter