కాజల్, తమన్నా మధ్య చిచ్చు పెట్టాలని చూసిన బాలీవుడ్ మీడియా


Kajal Aggarwal And Tamannah
కాజల్, తమన్నా మధ్య చిచ్చు పెట్టాలని చూసిన బాలీవుడ్ మీడియా

కొన్ని మీడియా సంస్థలంతే.. ఊరికే ఉండలేవు. వాళ్ళతో వీళ్ళకి.. వీళ్ళతో వాళ్ళకి గొడవలు పెట్టేలా ఆర్టికల్స్ రాస్తూ వారు ఏమైనా రియాక్ట్ అయితే చూసి ఆనందిస్తుంటాయి. ఇంచుమించు ఇలాంటి ప్రయత్నమే బాలీవుడ్ మీడియా సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్స్ మధ్య చేయబోయింది. అయితే ఆ ప్రయత్నం బెడిసికొట్టడంతో ఆ మీడియా వర్గాలు కిమ్మనకుండిపోయాయి. వివరాల్లోకి వెళితే..

ఆ ఇద్దరు హీరోయిన్లు కాజల్, తమన్నా. వీరిద్దరూ ఆఫ్ స్క్రీన్ లో ఎంత మంచి స్నేహితురాల్లో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఏమాత్రం వీలు దొరికినా ఇద్దరూ హ్యాంగౌట్ అవ్వడానికి చూస్తారు. అయితే కాజల్ ను ఒక హిందీ సినిమాలోనుండి పీకేసి ఆమె స్థానంలో తమన్నాను పెట్టుకున్నారని కొన్ని బాలీవుడ్ మీడియా వర్గాలు ప్రముఖంగా రాశాయి.

దీనివల్ల ఇద్దరు హీరోయిన్ల మధ్య ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని భావించాయేమో. అయితే కాజల్ జాన్ అబ్రహం, ఇమ్రాన్ హష్మీతో కలిసి సంజయ్ గుప్తా దర్శకత్వంలో చేస్తున్న ఆ సినిమా నిర్విఘ్నంగా షూటింగ్ జరుపుకుంటోందిట. సంజయ్ గుప్తా ఈ విషయంలో రియాక్ట్ అవుతూ ఇప్పటికే కాజల్ తో ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశామని, ఆమె లాంటి ప్రొఫెషనల్ నటిని తాను చూడలేదని ట్వీటాడు. దీనికి కాజల్ కూడా రీట్వీట్ కొట్టింది. సదరు న్యూస్ పుట్టించిన ఏజెన్సీలు మాత్రం గప్ చుప్ గా వేరే మసాలాను వండే పనిలో పడ్డాయి.

Credit: Twitter