సాహో కు షాక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్


ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సాహో చిత్రానికి షాక్ ఇచ్చారు సంగీత దర్శకులు శంకర్ , ఎహ్సన్ , లాయ్ . బాలీవుడ్ లో ఈ సంగీత త్రయం చాలా ఫేమస్ అన్న విషయం తెలిసిందే . సాహూ చిత్రాన్ని 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు , హిందీ , తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం కావడంతో దానికి తగ్గట్లుగా సంగీత దర్శకులు ఉండాలని శంకర్ , లాయ్ , ఎహ్సన్ లను తీసుకున్నారు . కట్ చేస్తే వాళ్ళు సాహో నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించి షాక్ ఇచ్చారు .

బాలీవుడ్ సంగీత త్రయం సాహో నుండి తప్పుకోవడంతో షాక్ అయిన చిత్ర బృందం మరో సంగీత దర్శకుడ్ని ఎంపిక చేసే పనిలో పడింది . ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే . ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 15 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇదే సమయంలో షాక్ ఇచ్చారు సంగీత త్రయం .