క‌రోనా దెబ్బ‌కు మ‌రొక‌రు బ‌లి!


క‌రోనా దెబ్బ‌కు మ‌రొక‌రు బ‌లి!
క‌రోనా దెబ్బ‌కు మ‌రొక‌రు బ‌లి!

క‌రోనా వైర‌స్ బాలీవుడ్‌ని కబ‌లిస్తోంది. ముంబై మ‌హాన‌గ‌రంలో క‌రోనా శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతుండంతో అక్క‌డే వున్న బాలీవుడ్ వారిని క‌రోనా దెబ్బ‌మీద దెబ్బ‌తీస్తోంది. దీని బారిన ప‌డి బాలీవుడ్‌లో వ‌రుస మ‌ర‌ణాలు సంభివిస్తుండ‌టం భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది. ఇప్ప‌టిఏ సినీ ప్ర‌ముఖుల ఇళ్ల‌ల్లో ప‌నివారికి పాకిన క‌రోనా సెల‌బ్రిటీల‌ని వ‌రుస‌గా క‌బ‌లిస్తోంది. మొన్న వాజీద్‌ఖాన్‌..తాజాగా ప్రొడ్యూస‌ర్ అనిల్ సూరి (77) క‌రోనా బారిన ప‌డి మృత్యు వాత ప‌డ్డారు.

జూన్ 2 నుంచి అనిల్ సూరి హైఫీవ‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు. ఉన్న‌ట్టుండీ ఆయ‌న టెంప‌రేచ‌ర్ ప్ర‌మాద స్థాయికి చేరింద‌ని, దీంతో ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించింద‌ని తెలిసి లీలావ‌తి, హిందూజా హాస్పిట‌ల్‌ల‌కు త‌ర‌లించినా వారు చేర్చుకోవ‌డానికి నిరాక‌రించార‌ని, చ‌వ‌ర‌కు ఓ మ‌ల్టీస్పెషాల‌టీ హాస్పిట‌ల్లో చేర్చినా ఆయ‌న ప్రాణాలు కాపాడ‌లేక‌పోయామ‌ని అనిల్ సూరి సోద‌రుడు వెల్ల‌డించారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు శుక్ర‌వారం పూర్త‌య్యాయి.

ధ‌ర్మేంద్ర‌, సునీల్ ద‌త్‌, క‌మ‌ల్‌హాస‌న్‌ల‌తో `రాజ్ తిల‌క్` వంటి భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల్లో ఆరోజుల్లోనే నిర్మించి అనిల్ సూరి ఆశ్చ‌ర్య‌ప‌రిచార‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.