కియారా కాదు స్టార్ కిడ్ ని ట్రై చేస్తున్నారా?కియారా కాదు స్టార్ కిడ్ ని ట్రై చేస్తున్నారా?
కియారా కాదు స్టార్ కిడ్ ని ట్రై చేస్తున్నారా?

`స‌రిలేరు నీకెవ్వ‌రు` విజ‌యంతో జాలీ మోడ్‌లోకి వెళ్లిపోయిన మ‌హేష్‌బాబు ఫ్యామిలీ క‌లిసి అమెరికా చుట్టొచ్చిన విష‌యం తెలిసిందే. వ‌చ్చిన త‌రువాత వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా స్టార్ట్ చేస్తాన‌ని వెల్ల‌డించిన మ‌హేష్ క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆ ప్రాజెక్ట్‌ని ప‌క్క‌న పెట్టేశాడు. వెంట‌నే ప‌ర‌శురామ్‌తో చిత్రాన్ని ఓకే చేశాడు. ఈ సినిమాని మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించ‌డానికి ముందుకొచ్చాయి.

అయితే ఈ సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుంది. ఇంత‌కీ మ‌హేష్ ఫైన‌ల్ స్క్రిప్ట్‌ని ఓకే చేశాడా? ల‌ఏదా ఏమైనా మార్పులు చెప్పాడా అని చ‌ర్చ జ‌రుగుతోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌హేష్ ఫైన‌ల్ స్క్రిప్ట్‌ని ఓకే చేసిన‌ట్టు తెలిసింది. ఫార్మ‌ల్‌గా మే 31న పూజ జ‌ర‌పాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది. మే 31న సూప‌ర్‌స్టార్ కృష్ణ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ప్ర‌తీ ఏడాదీ ఏదో ఒక న్యూస్‌ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకునే మ‌హేష్ ఈ సారి త‌న కొత్త చిత్రానికి సంబంధించిన పూజా కార్య‌క్రామాల్ని నిర్వ‌హించ‌బోతున్నార‌ట‌.

ఇదిలా వుంటే ఇందులో హీరోయిన్‌గా కియారా న‌టిస్తుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు షికారు చేస్తున్నాయి. అయితే కియారా వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వుండ‌టంతో ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశం లేద‌ని తెలిసింది. అయితే ఆమె స్థానంలో స్టార్ కిడ్ సారా అలీఖాన్‌ని చిత్ర బృందం సంప్ర‌దిస్తున్నార‌ట‌.