బాక్సర్ గా మెప్పించేది ఎవరు.?

బాక్సర్ గా మెప్పించేది ఎవరు.?
బాక్సర్ గా మెప్పించేది ఎవరు.?

సినిమాల్లో ఒక ట్రెండ్ మొదలయ్యింది అంటే, మిగిలిన వాళ్ళలో చాలా శాతం మంది మేకర్స్ ఆ మీటర్ లో సినిమాలు చేస్తూ ఉంటారు. ప్రేక్షకుల టేస్ట్ అప్పటికి అలా ఉండటం వల్లనో, లేక సినిమాలు చేసే వాళ్ళే అలా చెయ్యడం సేఫ్ అని ఫీల్ అవ్వడం వల్ల కూడా కావచ్చు. వరుసగా కొంత కాలంపాటు యాక్షన్, లవ్, రోమాన్స్, క్రైమ్, కామెడీ, పీరియాడికల్, బయోపిక్స్ ఇలా ఒకదాని తర్వాత ఒక జోనర్ లో ఏదైనా ఒక సినిమా వచ్చి హిట్ అయ్యింది అంటే వెంటనే కనీసం ఒక 10 సినిమాలు అదే జోనర్ లో వచ్చేస్తాయి.

ప్రస్తుత సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ కి బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ పై మోజు పుట్టింది. గతంలో తెలుగులో కూడా బాక్సింగ్, మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ జోనర్ లో సినిమాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ “తమ్ముడు”, రవితేజ “అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి” కొన్ని హిట్ సినిమాలకు ఉదాహరణలు. ఇప్పుడు ఒకసారి ప్రస్తుత పరిస్థితి చూస్తే మళ్ళీ పూరీ సర్ విజయ్ దేవరకొండ తో మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో “ఫైటర్” సినిమా చేస్తున్నారు. “గద్ధలకొండ గణేష్” లాంటి సాలిడ్ హిట్ తరువాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మళ్ళీ “బాక్సర్” సినిమా చేస్తున్నారు. తమిళంలో ఇప్పటికే సూపర్ విలన్ గా గుర్తింపు పొందిన అరుణ్ విజయ్ “బాక్సర్” అనే సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.

ధనుష్ తాజా చిత్రం “పట్టాస్” కూడా “ఆడిమురై” అనే పురాతన పోరాట క్రీడ నేపధ్యంలో సాగే సినిమా. వరుడు సినిమాలో “కూష్మాండ…!” అని మనల్ని భయపెట్టి, అటు తరువాత నేనే దేవుడు, రాజా రాణి లాంటి సినిమాలతో తెలుగువాళ్ళకు కూడా పరిచయం అయిన ఆర్య కూడా ఇప్పుడు దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్ లో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమా చేస్తున్నారు.

ప్రపంచంలో ఎంతమంది ఎన్ని సార్లు యాక్షన్ బేస్డ్ కథలు తీసినా, అందరూ తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ చూసే సినిమాలు “ఫైట్ క్లబ్”, “ఎంటర్ థ డ్రాగన్” లాంటి సినిమాలు. ఇప్పటికీ కొత్తగా మళ్ళీ ఫైటింగ్ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ అంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక 10 సినిమాలు చూసి అప్పుడు స్క్రిప్ట్ మొదలుపెడతారు. ఏదీ ఏమైనా ఈ ఎమోషన్స్ అన్నీ కేవలం సినిమాలతోనే ఆగిపోవడం బాధాకరం. బాక్సింగ్ ఆటలో మన కంటికి కనపడని డెప్త్ ఫిలాసఫీ చాలానే ఉంది. నిజానికి దానికి కనెక్ట్ అయ్యి అందరూ సినిమాలు చూస్తారు.