బాల‌య్య సినిమాకు టైటిల్ ఫిక్స్?


బాల‌య్య సినిమాకు టైటిల్ ఫిక్స్?
బాల‌య్య సినిమాకు టైటిల్ ఫిక్స్?

నంద‌మూరి బాల‌కృష్ణ , బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఇప్పి వ‌ర‌కు సింహా, లెజెండ్ వంటి హిట్ చిత్రాలు రూపొందాయి. ఈ రెండు చిత్రాల త‌రువాత ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి క‌లిసి ప‌నిచేస్తున్నారు. అయితే ఈ ద‌ఫా ఇద్ద‌రికీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ‌స‌రం. ఆ కోణంలో స‌రికొత్త నేప‌థ్యంలో తాజా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. త‌లి షెడ్యూల్ పూర్త‌యింది.

బాల‌య్య 106వ చిత్రం కావ‌డంతో ఈ సినిమా అన్ని విష‌యాల్లో చాలా ప్ర‌త్యేకంగా వుండాల‌ని ద‌ర్శ‌‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో బాల‌కృష్ణ తొలిసారి అఘోరాగా స‌రికొత్త గెట‌ప్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ గెట‌ప్ కోసం ఇప్ప‌టికే టు స్కెచెస్‌ని సిద్ధం చేశార‌ట‌. ఇందులో ఏది ఫైన‌ల్ అనుకుంటే ఆ గెట‌ప్‌లో బాల‌య్య‌ని అఘోరాగా చూపించ‌నున్నార‌ట‌.

ఇదిలా వుంటే ఈ చిత్రానికి `మోనార్క్‌` అనే టైటిల్‌ని ఖ‌రారు చేయ‌నున్న‌‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. జూన్ 10న బాల‌కృష్ణ పుట్టిన రోజు. ఆ రోజున ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని కూడా చిత్ర బృందం రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.