బోయ‌పాటి – బాల‌య్య‌ల సినిమా టైటిల్ ఇదేనా?


Boyapati Srinu and balakrishna movie title Danger
Boyapati Srinu and balakrishna movie title Danger

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడ‌వ సినిమా వ‌చ్చే స్తోంది. మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఊర మాస్  చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచారు బోయ‌పాటి శ్రీ‌ను. ఆయ‌న సింహా, లెజెండ్ చిత్రాల త‌రువాత బాల‌య్య‌తో క‌లిసి చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఇటీవ‌ల బాల‌కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన బీబీ3 ఫ‌స్ట్ రోర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ని పెంచేసింది. ఫ‌స్ట్ రోర్ లో బాల‌కృష్ణ చెప్పిన డైలాగ్‌లు, లుక్ సినిమా ఓ రేంజ్‌లో వుండ‌బోతుంద‌నే సంకేతాల్ని అందించింది. బోయ‌పాటి మార్కు మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి `మోనార్క్‌` అనే టైటిట్ తెగ ప్ర‌చారం అయింది. అయితే తాజాగా ఆ పేరు స్థానంలో `డేంజ‌ర్‌` టైటిల్‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

టైటిల్‌ని బోయ‌పాటి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తాజా స‌మాచారం. రైతు స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నార‌ట‌. ఇందులో బాల‌య్య డ్యుయ‌ల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇందులో ఒకటి అఘోరా పాత్ర కావ‌డం సినిమాపై మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. బాల‌కృష్ణ 106వ చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. కీల‌క ఘ‌ట్టాల‌ని కోవిడ్ ప్ర‌బ‌ల‌డానికి ముందే చిత్రీక‌రించారు. సెప్టెంబ‌ర్ నుంచి షూటింగ్‌ని పునః ప్రారంభించాల‌ని బోయ‌పాటి ప్లాన్ చేస్తున్నార‌ట‌. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.