బాల‌య్య – బోయ‌పాటి సినిమా వ‌చ్చేది అప్పుడే!


బాల‌య్య - బోయ‌పాటి సినిమా వ‌చ్చేది అప్పుడే!
బాల‌య్య – బోయ‌పాటి సినిమా వ‌చ్చేది అప్పుడే!

క‌రోనా వైర‌స్ విజృంభిస్తుండ‌టంతో కేంద్రం ఈ నెల 14న ముగుస్తున్న లాక్ డౌన్‌ని మే 3కు పొడిగించింది. దీంతో సినిమా వాళ్ల‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. లాక్ డౌన్ పొడిగించ‌డంతో షూటింగ్ షెడ్యూల్స్‌, డేట్స్ స‌మ‌స్య త‌లెత్తే అవ‌కాశం వుంది. అయితే అవేమీ మా చిత్రానికి అడ్డంకిగా మార‌డం లేద‌ని అంటున్నారు మాస్ యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను.

బాలకృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను ఓ మాస్ మ‌సాలా ఎంటర్‌టైనర్‌ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా బాల‌కృష్ణ అఘోరా గెట‌ప్‌లో న‌టించ‌బోతున్నారు. బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేస్తు్న ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు మేజ‌ర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. లాయితే లాక్ డౌన్ బిఫోర్ ఈ చిత్రాన్ని ద‌స‌రాకు రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు.

లాక్ డౌన్ పొడిగించ‌డంతో షూటింగ్ షెడ్యూల్ డిస్ట్ర‌బ్ అయ్యే ప్ర‌మాదం వుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంటే అలాంటి ఏద‌మీ లేద‌ని అనుకున్న స‌మ‌యానికే చిత్రాన్ని పూర్తి చేసి అక్టోబ‌ర్‌లో ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నట్టు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి కాన్ఫిడెంట్‌గా వున్న‌ట్టు తెలిసింది.