సింహా.. లెజెండ్‌.. అంత‌కు మించి..!


సింహా.. లెజెండ్‌.. అంత‌కు మించి..!
సింహా.. లెజెండ్‌.. అంత‌కు మించి..!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌నుల‌ది హిట్ కాంబినేష‌న్‌. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు సూప‌ర్ హిట్‌లుగా నిల‌వ‌డ‌మే కాకుండా బాల‌య్య కెరీర్‌కి నూత‌న జ‌వ‌స‌త్వాల‌ని అందించాయి. ఈ గురువారంతో బాల‌య్య‌, బోయ‌పాటిల తొలి క‌ల‌యిక‌లో వ‌చ్చిన‌ `సింహా` విడుద‌లై 1ఏ ఏళ్లు పూర్తి చేసుకుంది. తాజాగా వీరిద్ద‌రి క‌ల‌యికలో ముచ్చ‌టాగా మూడ‌వ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే.

ఈ చిత్రంపై ద‌ర్శ‌కుడు బోయపాటి ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. మా ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్క‌చిన `సింహా` చూశారు. ఆ త‌రువాత `లెజెండ్‌` చూశారు. ఈసారి అంత‌కు మించిన కొత్త‌దనాన్ని చూపించాల‌నుకుంటున్నాం. ఆ విష‌యంలో చాలా శ్ర‌మించాను. కొత్త‌ద‌నం కోసం క్యారెక్ట‌రైజేష‌న్ నుంచి క‌థ చెప్పాల‌నుకున్నాం. ఇందులో బాల‌య్య మ‌రింత కొత్త‌గా క‌నిపిస్తారు.

ఇందులో బాల‌య్య అఘోరాగా క‌నిపిస్తారు. ఆ వార్త నిజ‌మే. అయితే ఆ పాత్ర‌ని ఎలా డిజైన్ చేశాం, తెర‌పై ఎలా ప్ర‌జెంట్ చేస్తున్నాం అన్న‌ది మాత్రం స‌స్పెన్స్‌. ఈ క్వారెంటైన్ టైమ్‌లో ముందు రాసుకున్న కొన్ని పాత క‌థ‌ల్ని పాలీష్ చేశాను. బాల‌య్య సినిమా తొలి షెడ్యూల్ పూర్త‌యింది. ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌, ఎమోష‌న‌ల్ సీన్స్ ని పూర్తి చేశాం` అని బోయ‌పాటి వెల్ల‌డించారని తెలిసింది.