బోయపాటి మారక తప్పదా!


బోయపాటి మారక తప్పదా!
బోయపాటి మారక తప్పదా!

మాస్ దర్శకుడిగా బోయపాటి శ్రీను రేంజ్ వేరు. విలనిజాన్ని చూపించడంలో మాస్ ఎలిమెంట్స్ ను పండించడంలో బోయపాటి సిద్ధహస్తుడు. అయితే ఏదైనా అతిగా చేస్తే వికారం అవుతుందంటారు. అలాగే ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమాల పరిస్థితి కనపడుతోంది. అతని కథలు, టేకింగ్ ఒకేలా ఉంటుండడంతో బోయపాటి శ్రీను సినిమాలపై ఒకరకమైన నెగటివిటీ మొదలైంది.

వినయ విధేయ రామ సినిమా విషయంలో అదే జరిగింది. ఈ చిత్ర ఫెయిల్యూర్ తర్వాత బోయపాటి శ్రీను సినిమా ఒప్పుకోవాలంటే హీరోలు వెనుకంజ వేసే పరిస్థితి. అందుకే బోయపాటి శ్రీను కెరీర్ లో కూడా బ్రేక్ వచ్చింది. తనకి రెండు హిట్లు ఇచ్చినా కూడా బాలయ్య, బోయపాటి శ్రీను కథ గురించి ఒకట్రెండు సార్లు ఆలోచించి, రెండు మూడు నెలలు హోల్డ్ లో పెట్టి అప్పుడు ఓకే చెప్పాడు.

ఎంతసేపు హీరోకో, హీరోయిన్ కో అన్యాయం జరగడం.. దానికి హీరో విలన్ పై ప్రతీకారం తీర్చుకోవడం అంటూ అదే కథతో మాస్ చిత్రం అంటూ సినిమాలు తీయడం మానుకోవాలి అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు ప్రేక్షకులు కొత్తదనముంటేనే ఓటు వేస్తున్నారు. లేదంటే నిర్దాక్షిణ్యంగా సినిమాను పక్కన పడేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బోయపాటి మారక తప్పదు.