బాల‌కృష్ణ కోసం త‌మిళ హీరోయిన్‌?

బాల‌కృష్ణ కోసం త‌మిళ హీరోయిన్‌?
బాల‌కృష్ణ కోసం త‌మిళ హీరోయిన్‌?

సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్‌ల కొర‌త వున్న విష‌యం తెలిసిందే. సీనియ‌ర్ హీరోల‌తో సినిమా అంటే హీరోయిన్ దొర‌క‌డం నిర్మాతల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ప్ర‌స్తుతం ఇదే ప‌రిస్థితిని నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి ఎదుర్కొంటున్నారు. బోయ‌పాటి శ్రీ‌ను, బాల‌య్య‌ల కాంబినేష‌న్‌లో మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.

క‌రోనా ప్ర‌బ‌ల‌డానికి ముందు ఓ ఛేజింగ్ సీన్‌తో పాటు కొన్ని ఎమోష‌న‌ల్ సీన్స్‌ని పూర్తి చేసిన బోయ‌పాటి శ్రీ‌ను క‌రోనా తీవ్ర‌త త‌గ్గుముఖం ప‌ట్టిన త‌రువాత ప‌రిస్థితుల‌ని బ‌ట్టి ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ప్రారంభించాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అయితే ఈ చిత్రం కోసం ఇప్ప‌టి వ‌ర‌కు బాల‌య్య స‌ర‌స‌న హీరోయిన్‌గా ఇంత వ‌ర‌కు ఎవ‌రినీ ఎంపిక చేయ‌లేదు.

అంజ‌లి, శ్రియ, కేథ‌రిన్‌ వంటి వాళ్ల పేర్లు వినిపించినా ఎవ‌రూ ఫైన‌ల్ కాలేదు. తాజాగా త‌మిళ హీరోయిన్ అమ‌లా పాల్ పేరు వినిపిస్తోంది. ఆమెతో చిత్ర బృందం సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట‌. అమ‌లాపాల్ మాత్రం సెల‌క్టీవ్‌గా సినిమాలు చేస్తోంది. బాల‌య్య స‌ర‌స‌న న‌టించ‌డానికి అంగీక‌రిస్తుందా?  లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.