భారీతనంలో లోటుపాట్లు ఉండవంటున్న బోయపాటి


భారీతనంలో లోటుపాట్లు ఉండవంటున్న బోయపాటి
భారీతనంలో లోటుపాట్లు ఉండవంటున్న బోయపాటి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయినా కానీ అది మొదలవ్వడానికి చాలా బాలారిష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముందుగా ఈ సినిమాకు వేసుకున్న బడ్జెట్ వర్కౌట్ కాదని వాయిదా వేశారు. ఎందుకంటే బాలకృష్ణ రీసెంట్ గా నటించిన సినిమాలు అన్నీ ఒకదాన్ని మించి మరొకటి దారుణమైన పరాజయాలుగా మిగిలాయి. సినిమాలు కొన్న డిస్ట్రిబ్యూటర్లు దారుణంగా నష్టపోయారు. పైగా బోయపాటి శ్రీను కూడా ఒక దారుణమైన డిజాస్టర్ ను అందించి ఉన్నాడు. దీంతో బడ్జెట్ ను తగ్గించాలని భావించారు. దీనిపై చాలా తతంగమే నడిచింది. ముందు 60 కోట్లు అనుకున్న బడ్జెట్ కాస్తా 40 కోట్లకు కుదించగలిగారు.

అయితే ఇంతలోనే కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డబ్బుల్లేక నానా అవస్థలు పడుతున్నారు. సినిమాలకు కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. దీంతో ఈ సినిమా బడ్జెట్ ను మరోసారి సమీక్షిస్తారని, సినిమా రేంజ్ ను తగ్గిస్తారని వార్తలు వచ్చాయి. అయితే బోయపాటి శ్రీను ఈ వార్తలను పూర్తిగా కట్టిపడేసారు.

భారీతనంలో ఎక్కడా లోటుపాట్లు ఉండవని తెలిపాడు బోయపాటి. మా కాంబినేషన్ అంటే ఉండే అంచనాలు వేరు. భారీతనం తగ్గితే ఫ్యాన్స్ నిరుత్సాహపడతారు. ఎంతలో తీయాలో అంతలోనే తీస్తాం. అందరూ ఆనందపడే సినిమానే అవుతుంది అని తెలిపాడు బోయపాటి. ఈ చిత్రం కోసం ఇద్దరు కొత్త హీరోయిన్లను తీసుకుంటున్నట్లు ఇప్పటికే బోయపాటి శ్రీను ప్రకటించిన విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ షూటింగ్ లకు అనుమతి లభించిన వెంటనే ఉంటుందని తెలుస్తోంది. దసరా కానుకగా సినిమాను అందించాలని బోయపాటి ప్రణాళికలు రచిస్తున్నాడు. మరి అనుకున్నట్లుగా ఈ సినిమా తెరకెక్కి అద్భుత విజయం సొంతమవుతుందో లేదో చూడాలి.