నీ సినిమాలు చూసి పెరిగిన నన్ను ఇలా అంటావా?

Brahmaji
Brahmaji

నటులు ‘బ్రహ్మాజీ‘ ని ఇప్పటి తరం వారు ఈ మధ్య పరిచయం అయిన చిన్న నటులు అయ్యుంటారు లే, బలేగా యాక్టింగ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు కుర్రకారులు. నిజానికి ఆయన ఒకప్పుడు సినిమాలు చేసాడు… అవి చూసిన కుర్రకారులు ఆ సినిమాలో ఉన్నది ఈయనేనా? హీరోగా కూడా చేశాడా? అని బ్రహ్మాజీ గురించి తెగ గుసగుసలాడుతున్నారు. కారణం ఈ మధ్య బాగా సినిమాలు చేసుకుంటూ బిజీ అవ్వడం, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లో తాను నటిస్తున్న సినిమాల గురించి పోస్ట్స్ పెట్టడం జనాల దృష్టి ఆయన మీద పడేంతలా చేసాయి.

ఈ సంవత్సరం చిత్రలహరి, జెర్సీ, మహర్షి, గద్దలకొండ గణేష్ మొన్న విడుదల అయిన ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలు అని బ్రహ్మాజీ కి బ్రహ్మరధం పట్టాయి. అవన్నీ కూడా హిట్ సినిమాలే. అందులో నటించిన బ్రహ్మాజీ క్యారెక్టర్లు కూడా బాగా అలరించాయి. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా షూటింగ్ లో పాలు పంచుకున్న బ్రహ్మాజీ ఆ సినిమా సెట్లో దర్శకుడు ‘అనిల్ రావిపూడి’ గారితో సెల్ఫీ దిగి దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఆ పోస్ట్ కి దర్శకులు కూడా కౌంటర్ ఇచ్చేసారు.

బ్రహ్మాజీ గారు ఇలా ట్వీట్ చేసారు. “మేము మళ్ళీ  క్లాస్‌మేట్స్ అయ్యాము…ఇతని(అనిల్ రావిపూడి) తో కలిసి మళ్ళీ  పని చేయడం నాకు చాల సంతోషంగా ఉంది” అని ఇద్దరు మంచిగా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఉన్న ఫోటో ఒక్కటి పోస్ట్స్ చేసాడు. దానికి వెంటనే స్పందించిన అనిల్ రావిపూడి గారు కూడా రివర్స్ లో కౌంటర్ వేశారు. “సేమ్ గ్లాసెస్ అని ఫోటో టీసీ సేమ్ క్లాస్‌మేట్స్ (తరగతి) అంటావా? … ఏమైనా సరే నేను మీ సినిమాలు చూస్తూ పెరిగాను..అన్న గారు…అలాంటిది మన ఇద్దరిది ఒకే క్లాస్ అవ్వడం నేరం” అని ట్వీట్ చేసారు సున్నితంగా….

వీరిద్దరి పోస్ట్ చూసిన నెటిజన్లు ఒక రేంజ్ లో నవ్వుకోవడం మొదలు పెట్టేసారు. పాపం బ్రహ్మాజీ గారేమో తన ఏజ్ ని దాచిపెడదాం అని చెప్పి దర్శకుడిది నాది ఒకే క్లాస్ అని చెప్పడం వలన దానికి రివర్స్ లో దర్శకుడు కౌంటర్ వేసి ఏజ్ ని బయట పెట్టడం వలన బ్రహ్మాజీ గారి పరిస్థితి చూసి మనం కూడా నవ్వేసుకుంటాము.