లాక్‌డౌన్‌పై బ్ర‌హ్మాజీ సంచ‌ల‌నం!


లాక్‌డౌన్‌పై బ్ర‌హ్మాజీ సంచ‌ల‌నం!
లాక్‌డౌన్‌పై బ్ర‌హ్మాజీ సంచ‌ల‌నం!

క‌రోనా వైర‌స్ మ‌ధ్య త‌ర‌గ‌తి జీవితాల్ని చిదిమేస్తోంది. క‌రోనా కార‌ణంగా చాలా చోట్ల చాలా మంది ఉపాది కోల్పోతున్నారు. కొంత మంది త‌మ వ‌ర్గాల‌కు మాత్ర‌మే అండ‌గా నిల‌వాల‌ని వేరే వ‌ర్గం వారిని ప‌నుల్లోంచి తొల‌గిస్తున్నారు. ఇంకొంత మంది త‌మ ప్రాంతం కాని వారిని ఏవో సాకులు చెబుతూ రెండు నెల‌లు, లేదా మూడు నుంచి ఐదు నెల‌ల త‌రువాత మ‌ళ్లీ ప‌నుల్లో చేర్చుకుంటామంటూ త‌మ ప్రాంతం కాని వారిని విధుల నుంచి నిర్దాక్షిణ్యంగా తొల‌గిస్తున్నారు.

దీంతో ఒక్క తెలంగాణ‌లోనే చాలా మంది తెలంగాణ వారు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఆంధ్రా వారు ఉద్యోగాలు కోల్పోతున్నారు. లాక్‌డౌన్ ఇలాగే కొన‌సాగితే ఈ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారే అవ‌కాశాలే అత్య‌ధికంగా క‌నిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ని పొడిగిస్తున్నామ‌ని దీనికి 4.ఓ అంటూ నామ‌క‌ర‌ణం కూడా చేసింది. ఇక కేంద్రానికి భిన్నంగా తెలంగాణ ప్ర‌భుత్వం ఈ నెల 29 వ‌ర‌కు లాక్‌డౌన్‌ని పొడిగించింది.

దీనిపై న‌టుడు బ్ర‌హ్మాజీ త‌న‌దైన శైలిలో స్పందించారు. లాక్‌డౌన్ కార‌ణంగా సామాన్య జ‌నంతో పాటు సినీ కార్మికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్ ఇలాగే కొన‌సాగితే మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారే కాదు మా ప‌రిస్థితి కూడా అంతే న‌ని వెల్ల‌డించారు. చేతిలో బెచ్చెని చూపించే ఓ ఫొటోని షేర్ చేసిన బ్ర‌హ్మాజీ లాక్‌డౌన్ పొడిగిస్తే మా ప‌రిస్థితి ఇద‌ని సింబాలిక్‌గా వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.