బ్రహ్మాజీ కొడుకు కూడా హీరో అవుతున్నాడు


Actor Brahmaji's son Sanjay confirms his debut
Actor Brahmaji’s son Sanjay confirms his debut

క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ కొడుకు కూడా హీరో అవుతున్నాడు. తెలుగులో పలు చిత్రాల్లో కీలక పాత్ర పోషించిన బ్రహ్మాజీ కి సంజయ్ అనే కొడుకు ఉన్నాడు, అతడికి ఫిలిం నగర్ లో మంచి రెస్టారెంట్ బిజినెస్ కూడా ఉంది అయితే తండ్రి వారసత్వం ఎక్కడికి పోతుంది అందుకే వెండితెరపై వెలిగిపోవాలని హీరోగా రంగంలోకి దూకుతున్నాడు.

భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రంలో సంజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఇక తదుపరి షెడ్యూల్ కోసం అమలాపురం వెళ్లనున్నారు. బ్రహ్మాజీకి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు ఉంది దాంతో సంజయ్ కి అది ఉపయోగపడుతోంది.

టాలీవుడ్ లోని పలువురు సినీ ప్రముఖులతో బ్రహ్మాజీ కుటుంబానికి పరిచయాలున్నాయి. చాలామందికి కెరీర్ పరంగా సహాయం కూడా చేసింది బ్రహ్మాజీ కుటుంబం. సంజయ్ కూడా దర్శకులు కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసాడు కానీ ఇప్పుడు హీరోగా మారుతున్నాడు.