హాస్య‌న‌టుడు బ్ర‌హ్మానందం మొత్తానికి స్పందించారు!

హాస్య‌న‌టుడు బ్ర‌హ్మానందం మొత్తానికి స్పందించారు!
హాస్య‌న‌టుడు బ్ర‌హ్మానందం మొత్తానికి స్పందించారు!

క‌రోరా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న వేళ ఇది. దీని భారీ నుంచి త‌మ దేశ ప్ర‌జ‌ల‌ని ర‌క్షించ‌డం కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న దేశాల‌న్నీ క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేశాయి. ఇప్ప‌టికీ చేస్తున్నాయి. క‌రోనా కట్ట‌డి కోసం వ‌ర‌ల్డ్ వైడ్‌గా వున్న దేశాన్నీ లాక్ డౌన్‌ని విధించాయి. మ‌న దేశంలోనూ లాక్ డౌన్ 21 రోజుల పాటు విధించిన విష‌యం తెలిసిందే. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో లాక్ డౌన్‌ని మ‌రింత‌గా పొడిగించే అవ‌కాశాలే క‌నిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే క‌రోనా కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న వారిని ఆదుకోవ‌డానికి సినీ తార‌లు న‌డుం బిగించారు. కోట్లు విరాళంగా ప్ర‌క‌టిస్తూ చాలా మందిలో స్ఫూర్తిని నింపుతున్నారు. చిరంజీవి ద‌గ్గ‌రి నుంచి సాయిధ‌ర‌మ్‌తేజ్ వ‌ర‌కు ప్ర‌తీ హీరో, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు క‌రోనా రిలీఫ్ ఫండ్ ని అందించ‌డానికి ముందుకొచ్చారు.

తాజాగా హాస్య న‌టులు బ్ర‌హ్మానందం కూడా నేను సైతం అంటూ కొంత ఆల‌స్యంగా అయినా స్పందించారు. సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సీసీసీకి త‌న వంతు బాధ్య‌త‌గా 3 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు.