బ్రహ్మీ కెరీర్ ను వాల్మీకి కొత్త టర్న్ తిప్పుతాడా?


Brahmanandam
బ్రహ్మీ కెరీర్ ను వాల్మీకి కొత్త టర్న్ తిప్పుతాడా?

బ్రహ్మానందం.. ఈయన పేరు ముందు కామెడీ కింగ్ అని తప్పక తగిలిస్తారు ఎవరైనా. మరి లేకపోతే ఒకటా రెండా ఏకంగా మూడు దశాబ్దాల పాటు తెలుగు ఇండస్ట్రీని కామెడీ పాత్రలతో ఏలాడు బ్రహ్మానందం. ఇతను లేకుండా అసలు సినిమా తెరకెక్కేదే కాదు. అలాంటిది గత రెండేళ్లుగా బ్రహ్మీ అసలు సోదిలో లేకుండా పోయాడు. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి.

ఒకటి బ్రహ్మానందం వేస్తున్న కామెడీ పాత్రలు తేలిపోతున్నాయి, మరొకటి బ్రహ్మానందాన్ని అదిరిపోయే పాత్రలిచ్చే దర్శకులు కామెడీ పండించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మీ అసలు సినిమాల్లో కనిపించడమే మానేసాడు. ఏదైనా సినిమాలో బ్రహ్మీ ఉంటే ఆశ్చర్యపోయే పరిస్థితి. కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన బ్రహ్మానందం, కొంతకాలంగా పల్లమే చూస్తున్నాడు. తనకి సరైన పాత్రనిచ్చే దర్శకుడి కోసం ఎదురుచూస్తున్నాడు.

సరిగ్గా ఇలాంటి సమయంలో బ్రహ్మీకి తన సినిమాలో సముచిత స్థానం కల్పించాడు హరీష్ శంకర్. వాల్మీకి చిత్రంలో బ్రహ్మీ మంచి పాత్ర చేసాడని అంటున్నారు. ఇది కనుక హిట్ అయితే బ్రహ్మీకి పునర్వైభవం రావడం ఎంతసేపు?